తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు తీరాయి మిషన్ భగీరథతో మంచినీళ్ల గోస తీరింది అన్నిరంగాల్లో అద్భుతమైన ప్రగతి సాధించాం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితం తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం కేసీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఏ సమస్యలు తీరుతాయని ఆశించామో, ఆ సమస్యలు పరిష్కారమవుతున్నాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రైతులు, వ్యవసాయం పరిస్థితి దారుణంగా ఉండేదన్నారు. నేడు తెలంగాణ వ్యవసాయం దేశంలోనే అగ్రగామిగా ఉందని పునరుద్ఘటించారు. […]
సారథి న్యూస్, హైదరాబాద్: అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ సంక్షేమ పథకాలు, సరికొత్త ఆవిష్కరణలతో దేశానికే దిక్సూచిలా మారిన తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గవర్నర్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. దేశంలో మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రజలు సుదీర్ఘ, శాంతియుత పోరాటం ద్వారా స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారని కొనియాడారు. ఆరేళ్ల కాలంలో రాష్ట్రం […]
సారథి న్యూస్,మహబూబ్‌నగర్: కృష్ణానదిపై పెండింగ్ ప్రాజెక్టులను వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం కృష్ణాజలాల పరిరక్షణ దీక్ష చేస్తున్న ఏఐసీసీ కార్యదర్శి, మాజీమంత్రి జిల్లెల చిన్నారెడ్డి, దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ నేత, టీపీసీసీ కార్యదర్శి జి.మధుసూదన్ రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రీతం చేపట్టిన దీక్షను స్థానిక కాంగ్రెస్ నాయకులు విరమింపజేశారు. పెండింగ్ ప్రాజెక్టులపై టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. అలాగే టీపీసీసీ సంయుక్త కార్యదర్శి కాటం ప్రదీప్ కుమార్ గౌడ్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు […]
సారథి న్యూస్, గోదావరిఖని: జిల్లా రామగుండం డివిజన్-3 పరిధిలోని ఓపెన్ కాస్ట్(ఉపరితల గని)-1 లోని ఫేస్-2లో గల బ్లాస్టింగ్ స్పాట్ వద్ద మంగళవారం ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిన ఘటనలో నలుగురు కార్మికులు బండి ప్రవీణ్ (గోదావరిఖని), రాజేష్( ఖమాన్పూర్), అంజయ్య, రాకేష్ మృతిచెందారు. మరో ఇద్దరు కార్మికులు వెంకటేష్, భీమయ్య తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం సంభవించిన ప్రాంతాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పరిశీలించారు. సంఘటనకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సారథి న్యూస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జులై 10వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. పరీక్షలు నాటికి కరోనా కేసులు వస్తే అందుకు అనుగుణంగా మార్పులు చేస్తామన్నారు. ప్రతి గదిలో 10 నుంచి 12 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొత్తం 4,154 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు, ప్రతి పరీక్ష కేంద్రం వద్ద శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్, మాస్కులను అందుబాటులో ఉంచుతాం తెలిపారు. […]
సారథి న్యూస్, రామడుగు: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గంట్ల వెంకరెడ్డి జాతీయ పతాకం ఎగరవేశారు.ఈ సందర్భంగా అమరుల త్యాగాలను గుర్తుచేశారు. అనంతరం హమాలీలకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అబ్దుల్ అజీజ్, పైడ్లా శ్రీను, రాగం లచ్చయ్య, శ్రీనివాస్ రెడ్డి, స్వామి, మచ్చ గంగయ్య, కోట్ల మల్లేశం, మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.
సారథి న్యూస్, హుస్నాబాద్ : రైతుబంధుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర నాయకుడు గవ్వ వంశీధర్ రెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లాలో ఏర్పాటుచేసిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పంటలపై నియంత్రణ విధించడంతో రైతుబంధు విషయంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. గతంలో రైతులు తమ భూములకు అనుకూలంగా పలు రకాల పంటలు పండిస్తే ప్రభుత్వం నూతన వ్యవసాయ విధానం తీసుకురావడమే కాకుండా గతంలో […]
సారథి న్యూస్, మెదక్: సీఎం కేసీఆర్ రైతులకు ఆపద్భాండవుడని, రైతుబిడ్డగా రైతులు పడే కష్టాలన్ని విషయాలు ఆయనకు తెలుసునని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం మెదక్ కలెక్టరేట్ ఆవరణలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం రూ.12వేల కోట్ల రుణమాఫీ చేసి 53 వేలమంది రైతులకు ఎంతో మేలు చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏదో మాట్లాడారు… కొండపోచమ్మ సాగర్ ను చూసి […]