సారథి న్యూస్, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం మందుబాబులకు తీపికబురు చెప్పింది. మరో రెండు గంటల పాటు మద్యం అమ్మకాలకు పర్మిషన్ ఇస్తున్నట్లు సర్కారు ప్రకటించింది. కరోనా వ్యాప్తి.. లాక్ డౌన్ అమలు అనంతరం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా వైన్స్ తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకే మాత్రమే మద్యం అమ్మకాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాజాగా రాత్రి 8 గంటల వరకు తెరుచుకోవచ్చని ఎక్సైజ్ శాఖ పర్మిషన్ ఇచ్చింది. […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఈనెల 2న ప్రాజెక్టుల బాట పట్టాలని సోమవారం కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. కృష్ణానదిపై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. అక్కడే నిరసన దీక్షలు చేపట్టనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన కార్యక్రమాలను కొనసాగించనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు దీక్షలను విజయవంతం చేయాలని నాయకులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. […]
సారథి న్యూస్, కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన సూక్ష్మకళాకారుడు గాలిపెల్లి చోళేశ్వర్ చారి సోమవారం పెన్సిల్ మొనపై అమరవీరుల స్థూపాన్ని చెక్కాడు. అమరవీరులను స్మరిస్తూ ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేస్తుందని, ఇది ఆ అమరవీరులకు అంకితమిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత సూచించారు. పట్టణంలోని 1,13వ వార్డుల్లో సోమవారం శానిటేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగీకి కారణమయ్యే దోమలు పెరగకుండా చూసుకోవాలన్నారు. ఆమె వెంట వైస్ చైర్ పర్సన్ అనిత, కౌన్సిలర్లు కొంకటి నళినిదేవి, కల్పన, సుప్రజా, మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య ఉన్నారు.
సారథి న్యూస్, మహబూబ్ నగర్: పల్లెలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతికాలనీ, మర్లు, నలంద ఆటోస్టాండ్ ప్రాంతాల్లో పర్యటించారు. డెంగీ, మలేరియా వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నాలాలు, రోడ్లపై చెత్తాచెదారం వేయకుండా పట్టణవాసులు చూసుకోవాలన్నారు. మంత్రి వెంట కలెక్టర్ ఎస్.వెంకట్రావు, అడిషనల్ కలెక్టర్ మోహన్ లాల్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సిములు, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, […]
సారథి న్యూస్, మహబూబ్ నగర్: కరోనా వ్యాప్తి, వర్షాకాలం సీజనల్ వ్యాధుల నేపథ్యంలో జాగ్రత్త చర్యలపై స్టేట్ హెల్త్ బృందం సభ్యులు డాక్టర్ రాజశేఖర్, సంజీవరెడ్డి సోమవారం కలెక్టర్ క్యాంపు ఆఫీసులో కలెక్టర్ ఎస్.వెంకట్రావును కలిసి చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యాధుల ముప్పుపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తామన్నారు. ఈనెల 4న కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో డాక్టర్ కృష్ణ, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ విజయ్ […]
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మాజీ ఎంపీపీ తడగొండ అంజలి మామ తడగొండ పోచమల్లు ఇటీవల అనారోగ్యంతో చనిపోవడంతో ఆ కుటుంబాన్ని జై తెలంగాణ ఫౌండేషన్ చైర్మన్, కేటీఆర్ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఆర్.వివేకానంద సోమవారం పరామర్శించారు. ఆయన వెంట సర్పంచ్ బక్కశెట్టి నర్సయ్య, ఎంపీటీసీ మోడీ రవీందర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తడగొండ అజయ్, మాజీ ఎంపీటీసీ పెంచాల మల్లారెడ్డి ఉన్నారు.
సారథి న్యూస్, రామడుగు: ఉద్యమమే ఊపిరిగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలకపాత్ర పోషించి యువతను రాష్ట్రసాధనలో కార్మోన్యుకులుగా తీర్చిదిద్దిన పెందోట మోహనాచారి కుటుంబానికి సోమవారం టీఆర్ఎస్ నాయకులు బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేశారు. మామిడి నర్సయ్య, రాగం లచ్చయ్య, మాదం రమేష్, అబ్దుల్ అజీజ్, సలాఉద్దీన్ పాల్గొన్నారు.