Breaking News

Month: May 2020

వలస కార్మికుల లిస్టు రెడీ చేయండి

వలస కార్మికుల లిస్టు రెడీ చేయండి

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: కరోనా కారణంగా ఇప్పటి వరకు ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయి జిల్లాకు వస్తున్న వలస కార్మికులపై ప్రత్యేకదృష్టి పెట్టాలని మహబూబ్​ నగర్​ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్​ లో వారితో సమీక్షించారు. జిల్లా నుంచి వెళ్లేవారి లిస్టును రెడీ చేయాలని సూచించారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారందరినీ హోం క్వారంటైన్​ లో ఉంచాలని, ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు గుర్తించినట్లయితే ప్రభుత్వ ఆస్పత్రి, ఎస్​వీఎస్​ ఆస్పత్రికి […]

Read More
కూలీలు ఆకలితో బాధపడొద్దు

కూలీలు ఆకలితో బాధపడొద్దు

సారథి న్యూస్​, గోదావరిఖని: లాక్​ డౌన్​ నేపథ్యంలో సొంత రాష్ట్రాలకు వెళ్తున్న వలస కూలీలకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా చౌరస్తాలో ఏర్పాటుచేసిన అన్నదానం కార్యక్రమాన్ని సీపీ సత్యనారాయణ శుక్రవారం ప్రారంభించారు. పేదలకు ఇబ్బందులు పడకూడదనే భోజనాలు పెట్టిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, పట్టణ సీఐ మూర్తిలింగయ్య, మంచిర్యాల రూరల్ సీఐ కృష్ణ కుమార్, మంచిర్యాల పట్టణ ఎస్సైలు ప్రవీణ్ కుమార్ మారుతి, మార్వాడి అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Read More
పేద కుటుంబానికి సాయం

పేద కుటుంబానికి సాయం

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: పిడుగుపాటుకు గురై ఇటీవల మరణించిన కుటుంబానికి మంత్రి వి.శ్రీనివాస్​ గౌడ్​ శుక్రవారం రూ.40వేల చెక్కు, ఇతర సరుకులను అందజేశారు. మహబూబ్ నగర్ రూరల్ మండలం మాచన్ పల్లి పంచాయతీ పరిధిలోని రోళ్లగడ్డతండాకు చెందిన భీమ్లా నాయక్, సరోజ దంపతులు గతనెల 28న పిడుగుపాటుకు గురై చనిపోయారు. మంత్రి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

Read More
ఘనంగా మే డే

ఘనంగా మే డే

సారథి న్యూస్​, గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ), అర్జీ1 కమిటీ ఆధ్వర్యంలో  గోదావరిఖని ఆఫీస్, ఏరియా వర్క్ షాప్, రమేష్ నగర్ తదితర ప్రాంతాల్లో శుక్రవారం మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, కనకయ్య, మహేష్, మెండ శ్రీనివాస్, జె.గజెందర్, సానం రవి, అంజయ్య, కె రంగారావు, వంగల రాములు పాల్గొన్నారు.

Read More

వామ్మో.. ఇన్ని పాములా?

–ఇంటి గోడలో 33 పాములు సారథి న్యూస్, నర్సాపూర్: మెదక్​ జిల్లా కౌడిపల్లిలోని కొత్తకాలనీలో ఇట్టబోయిన మల్లమ్మ ఇంట్లో ఓ పాము, 32 పాము పిల్లులు వెలుగు చూడడం కలకలం చెలరేగింది. ఇంట్లో రెండు రోజుల క్రితం ఒకపాము బయటకు రావడంతో ఏమిటా? అని గమనించిన కుటుంబసభ్యులు శుక్రవారం ఇంటి గోడను కూలగొట్టడంతో ఒక్కసారిగా పాములన్నీ బయటకు వచ్చాయి. వాటిని చంపేశారు. 

Read More
పేదలను ఆదుకోవాలి

పేదలను ఆదుకోవాలి

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: కరోనా వేళ పేదలను ఆదుకోకుండా  కార్పొరేట్ కంపెనీలకు రుణాలు మాఫీచేయడం ఏమిటని సీపీఐ మహబూబ్​ నగర్​ జిల్లా కార్యదర్శి పరమేష్ గౌడ్ విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ ఆఫీసులో విలేకరులతో మాట్లాడారు.అంతకుముందు మే డే వేడుకల్లో పాల్గొన్నారు. జర్నలిస్టులకు రూ.15వేలు ఇవ్వాలని, పేదలకు నేరుగా రూ.1500 ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో మకాం రామ్మోహన్, బాలకిషన్, విల్సన్, హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు.

Read More
వినతిపత్రాలు ఇస్తేనే సరిపోదు

వినతిపత్రాలు ఇస్తేనే సరిపోదు

మంత్రి హరీశ్​ రావు విమర్శలు సారథి న్యూస్, మెదక్: తాము రైతుల పక్షాన పనిచేస్తుంటే ప్రతిపక్ష నేతలు ఏసీ రూముల్లో కూర్చుని ఏవేవో మాట్లాడుతున్నారని ఆర్థిక మంత్రి హరీశ్​ రావు విమర్శించారు. ప్రతిపక్షాలకు ధైర్యం ఉంటే ప్రజల మధ్య తిరగాలని, హైదరాబాద్ లో కూర్చుని గవర్నర్ కు వినతిపత్రాలు ఇస్తే సరిపోదని హితవు పలికారు. శుక్రవారం ఆయన మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలో పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం నర్శరీని సందర్శించారు. ఈ […]

Read More
గాలివాన బీభత్సం.

గాలివాన బీభత్సం

తెలంగాణ, మెదక్​, లోకల్​ న్యూస్​ మహిళ మృతి.. ఎగిరిన ఇంటి పైకప్పు రేకులు రెక్కల కష్టం నీటిపాలు సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలోనీ పలు ప్రాంతాల్లో శుక్రవారం ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీవర్షం కురిసింది. గాలి దుమారానికి ఇళ్ల పైకప్పు రేకులు ఎగిరిపడి బలమైన గాయం కావడంతో ఓ మహిళ మృతిచెందింది. ఆయా ప్రాంతాల్లో పెద్దమొత్తంలో ధాన్యం తడిసిపోయింది. మెదక్ పట్టణంలో బలమైన గాలులతో పాటు వడగళ్ల వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాలు […]

Read More