Breaking News

Month: May 2020

ధోనీ.. నంబర్​వన్​

మాజీ బ్యాట్స్​ మెన్ మహ్మద్ కైఫ్ న్యూఢిల్లీ: టీమిండియాలోకి ఎంతమంది వికెట్​ కీపర్లు వచ్చినా.. మహేంద్ర సింగ్ ధోనీ స్థానాన్ని భర్తీ చేయలేరని మాజీ బ్యాట్స్​ మెన్ మహ్మద్ కైఫ్ అన్నాడు. ఫిట్​ నెస్, కీపింగ్ విషయంలో అతన్ని తలపించేవారు లేరన్నాడు. అందుకే ఇప్పటికీ మహీయే నంబర్​వన్​ కీపర్ అని చెప్పాడు. ‘ఐపీఎల్​తో పునరాగమనం చేద్దామని ధోనీ భావించాడు. కానీ అది వాయిదా పడింది. కానీ నా దృష్టిలో అది సరైన ఆలోచన కాదు. ఎందుకంటే ధోనీ […]

Read More

ఒలింపిక్స్ జరగకపోతే రద్దే

ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ టోక్యో: అనివార్య కారణాలతో వచ్చే ఏడాది ఒలింపిక్స్ నిర్వహణ సాధ్యం కాకపోతే.. గేమ్స్ రద్దవుతాయని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ స్పష్టం చేశారు. మరో ఏడాది వాయిదా వేసే అవకాశం ఎంతమాత్రం లేదన్నారు. ‘జపాన్ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. దాదాపు ఐదువేల మందితో కూడిన నిర్వాహక కమిటీని నిరంతరం నడపం చాలా కష్టం. ప్రతి ఏడాది మిగతా క్రీడాసమాఖ్యలు కూడా షెడ్యూల్స్​​ను మార్చుకోవు. అథ్లెట్లు కూడా […]

Read More

ఐసీసీ చైర్మన్​ గా దాదా రావాలి

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ జొహన్నెస్​ బర్గ్​: బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ.. ఐసీసీ చైర్మన్​గా బాధ్యతలు చేపడితే బాగుంటుందని దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. ఈనెలలో దిగిపోనున్న శశాంక్ మనోహర్ స్థానాన్ని దాదా భర్తీ చేయాలన్నాడు. ‘గంగూలీ అత్యున్నత స్థాయి క్రికెట్ ఆడాడు. కాబట్టి క్రికెట్​ పై ఆయనకు పూర్తి అవగాహన ఉంటుంది. ఇతర విషయాలను కూడా బాగా అర్థం చేసుకుంటాడు. అందుకే దాదాలాంటి వ్యక్తి ఐసీసీ బాధ్యతలు తీసుకుంటే అందరికీ […]

Read More

సైక్లిస్ట్ జెర్లిన్‌సన్‌పై నాలుగేళ్ల బ్యాన్

సైక్లింగ్‌ వరల్డ్‌ గవర్నింగ్‌ బాడీ చర్యలు పారిస్‌: కొలంబియా సైక్లిస్ట్‌ జెర్లిన్‌సన్‌ పాంటానోపై సైక్లింగ్‌ వరల్డ్‌ గవర్నింగ్‌ బాడీ కొరడా ఝుళిపించింది. డోపింగ్‌లో పట్టుబడ్డందుకు అతనిపై నాలుగేళ్ల బ్యాన్‌ విధించింది. గతేడాది జరిగిన డోపింగ్​ టెస్ట్‌లో అతను బ్లడ్‌ బూస్టర్‌ ఈపీవో తీసుకున్నట్లు తేలింది. 2019 ఫిబ్రవరిలో అవుట్‌ఆఫ్‌ కాంపిటీషన్‌లో భాగంగా ఈ శాంపిల్స్‌ను సేకరించారు. అప్పటి నుంచి ప్రొవిజనల్‌ సస్పెన్షన్‌లో ఉన్న 31ఏళ్ల పాంటానోపై అధికారికంగా చర్యలు తీసుకున్నారు. 2016 టూర్‌డి ఫ్రాన్స్‌ టైటిల్‌ను గెలిచిన […]

Read More

క్రికెట్ మొదలుపెట్టొచ్చు

ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ మెల్‌ బోర్న్‌: కరోనా వైరస్ నియంత్రణలోకి వచ్చిన తర్వాత క్రికెట్​ను సురక్షితంగా మొదలుపెట్టడానికి ఐపీఎల్ మంచి మార్గమని ఆస్ర్టేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ అన్నాడు. అక్టోబర్, నవంబర్​లో జరిగే టీ20 ప్రపంచకప్​ సన్నాహకంగా ఉపయోగపడుతుందన్నాడు. ఈ సీజన్​లో ఏదో ఓ దశలో ఐపీఎల్ జరుగుతుందని కమిన్స్ ఆశాభావం వ్యక్తంచేశాడు. ‘నేను లాక్​ డౌన్​లో ఉన్నా కోల్​ కత్తా మేనేజ్​మెంట్​ తో మాట్లాడుతూనే ఉన్నాం. వాళ్లందరూ ఐపీఎల్ జరుగుతుందనే నమ్మకంతోనే ఉన్నారు. కాబట్టి […]

Read More

కల్తీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్​

మంత్రి ఎస్​.నిరంజన్​రెడ్డి సారథి న్యూస్​, హైదరాబాద్: రైతులకు కల్తీ విత్తనాలు అంటగడితే పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి ఎస్​.నిరంజన్​రెడ్డి హెచ్చరించారు. గురువారం హైదరాబాద్​లోని రాష్ట్ర రైతు సమన్వయ సమితి ఆఫీసులో వివిధ జిల్లాల అధ్యక్షులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సమగ్ర వ్యవసాయ ప్రణాళిక అమలులో రైతు సమన్వయ సమితులు కీలకంగా పనిచేయాలని సూచించారు. డిమాండ్​ ఉన్న పంటలను మాత్రమే సాగుచేసేలా రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర […]

Read More

కరోనాతో కానిస్టేబుల్ మృతి

డీజీపీ మహేందర్‌ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో కరోనా తొలి మరణం నమోదైంది. పోలీసు కానిస్టేబుల్‌ దయాకర్‌ రెడ్డి కరోనా వైరస్‌తో ప్రాణాలు కోల్పోయినట్లు డీజీపీ మహేందర్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. బుధవారం రాత్రి గాంధీ ఆస్పత్రిలో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దయాకర్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు డీజీపీ మహేందర్‌ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని డీజీపీ భరోసా ఇచ్చారు. మన్సూరాబాద్‌కు చెందిన దయాకర్‌ రెడ్డి […]

Read More

ఫస్ట్ లెవెల్ ఫ్లై ఓవర్ ప్రారంభం

ప్రారంభించిన మంత్రి కేటీఆర్​ సారథి న్యూస్​, హైదరాబాద్​: నగరంలోని బయోడైవర్సిటీ జంక్షన్ వద్ద నిర్మించిన ఫస్ట్ లెవెల్ ఫ్లై ఓవర్​ బ్రిడ్జిని మున్సిపల్​శాఖ మంత్రి కె.తారక రామారావు గురువారం ప్రారంభించారు. ఈ ఫ్లై ఓవర్​ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో గచ్చిబౌలి నుంచి మెహిదీపట్నం వైపునకు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తీరనున్నాయి. ఈ ఫ్లైఓవర్​ బ్రిడ్జి నిర్మాణానికి రూ.30.26 కోట్లు వ్యయం అయినట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ […]

Read More