సారథి న్యూస్, రామాయంపేట: సీఎం కేసీఆర్ సంకల్పించిన నియంత్రిత సాగు విధానానికి తాము రెడీ.. అంటూ మెదక్ జిల్లా, నిజాంపేట మండలం, కె.వెంకటాపూర్ గ్రామస్తులు బుధవారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సతీశ్ మాట్లాడుతూ.. వానాకాలంలో మక్క పంటను వేయమని, అధికారుల సూచనల మేరకు పంటలను వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. సర్పంచ్ అనిల్ కుమార్, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి, గ్రామస్తులు దయాకర్, ఎంపీపీ, జడ్పీటీసీ పాల్గొన్నారు.
22 మందికి అస్వస్థత ఇద్దరి పరిస్థితి విషమం సారథి న్యూస్, ఆదిలాబాద్: కలుషిత ఆహారం తిని 22 మంది అస్వస్థతకు గురైన సంఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం శ్యాంనాయక్ తండాలో బుధవారం చోటుచేసుకుంది. ఏటా తండాలో దుర్గామాత పూజ నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా జరుపుకున్నారు. రాత్రి వండిన మటన్ ను సంప్రదాయం ప్రకారం పూజలో పాల్గొన్న వారు ప్రసాదంగా తీసుకుంటారు. ఎండకాలం కావడంతో మటన్ కులుషితం కావడంతో 22 మంది అస్వస్థతకు […]
సారథి న్యూస్, హుస్నాబాద్ : సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని మున్సిపల్ చైర్ పర్సన్ ఆకుల రజిత పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని స్థానిక అగ్రికల్చర్ ఆఫీసులో ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో మాట్లాడారు. రైతులు మొక్కజొన్న పంటను వానాకాలంలో వేయొద్దని, యాసంగిలో సాగుచేసుకోవాలన్నారు. వరి, పత్తి వాణిజ్య పంటలతోపాటు పప్పు దినుసులైన కంది, పెసర, కూరగాయలు సాగుచేయడం ద్వారా వ్యవసాయం లాభసాటిగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ అయిలేని అనిత, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, […]
సారథి న్యూస్, రామడుగు : కరోన లాక్ డౌన్ నేపథ్యంలో గల్ఫ్ లో చిక్కుకున్న కార్మికుల ఆదుకోవాలని దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవా సమితి మీడియా కో-ఆర్డినేటర్ చిలముల రమేష్ పిలుపు మేరకు గల్ఫ్ జేఏసీ మండల కమిటీ సభ్యులు తహసీల్దార్ కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో కోరె కరుణాకర్ రెడ్డి, యమా అరుణ్, భగత్, విజయ్, అనిల్, మండల శేఖర్, పోతు మహేష్, అశోక్, నాగం మోహన్, బడుగు సాయి తేజ పాల్గొన్నారు.
సారథి న్యూస్, చేవెళ్ల : సర్పంచుల సంఘం మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా చేవెళ్ల సర్పంచ్ బండారు శైలజ నియమితులయ్యారు. బుధవారం సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు చక్కటి వెంకటేశ్ యాదవ్ నియామక పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు రవీందర్ గౌడ్, మండలంలోని పలు గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా ఎంపిక చేయడం ఆనందంగా ఉందని శైలజ పేర్కొన్నారు.
సారథి న్యూస్, రామడుగు : రామడుగు పీహెచ్సీని కరీంనగర్ డీఎంహెచ్వో జి.సుజాత బుధవారం సందర్శించారు. పలు రికార్డులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యంపై ఆరాతీశారు. ఆరోగ్య కేంద్రం పరిధిలో గల ముంబై, మహారాష్ట్ర లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి హోమ్ క్వారంటైన్ లో ఉంటున్న వారికి పలు సూచనలు చేశారు. కరోనా లక్షణాలు గల అనుమానితులను జిల్లా క్వారంటైన్ కు రెఫర్ చేయాలని సూచించారు. ఆమె వెంట మండల వైద్యాధికారి శ్రీనివాస్ తో పాటు వైద్య […]
సారథి న్యూస్, మహబూబ్ నగర్ : ఈనెల 27 నుండి 30 వరకు తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం, ఈఎల్ఎంఎస్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాయామ విద్య ఆన్లైన్ క్లాసెస్ ను జిల్లాలోని పీఈటీలు, పీడీలు వినియోగించుకోవాలని సంఘం మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు దూమర నిరంజన్, ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య బుధవారం కోరారు. మొదటి రోజు సెషన్ లో భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి […]
మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు సారథి న్యూస్, పెద్దపల్లి : రాష్ట్రంలోని రైతులు, కేసీఆర్ ప్రభుత్వం చెప్పిన పంటలనే పండించాలా..అని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మండిపడ్డారు. బుధవారం పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. రైతులు కష్టపడి పంటలు పండిస్తే ప్రభుత్వం చెప్పిన పంటలు పండించకపోతే రైతుబంధు ఇవ్వబోమని చెప్పడం సరికాదన్నారు. రైతులు పండించిన దొడ్డు రకం వడ్లకే ఏ గ్రేడ్ ధర కాకుండా కామన్ రేట్ కింద తీసుకుని వడ్లను కటింగ్ […]