మంత్రి కేటీఆర్ సారథి న్యూస్, హైదరాబాద్: పదివారాల పాటు డ్రై డే కార్యక్రమం నిర్వహించాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. డ్రై డేలో భాగంగా ఆదివారం హైదారాబాద్ ప్రగతిభవన్ లోని గార్డెన్ పూలకుండీలతో పాటు తొట్టిల్లో నిండిన నీటిని శుభ్రంచేశారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు రాష్ట్రప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా ప్రజలు కలిసి రావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
సారథి న్యూస్, శ్రీకాకుళం: ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్)లో కొంత భాగాన్ని కోవిడ్ –19 ఆస్పత్రిగా సిద్ధం చేస్తున్నామని శ్రీకాకుళం కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఆదివారం స్థానిక ఆస్పత్రిని ఆయన సందర్శించారు. ఐదొందల పడకల సామర్థ్యంతో కోవిడ్ విభాగాన్ని పటిష్టం చేస్తున్నామని వెల్లడించారు. రోజుకు రెండువేల వైద్యపరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉందన్నారు. పరీక్షలకు ముందుకు వచ్చే వారికి టోకెన్ జారీచేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్ ఎం.చెంచయ్య, ప్రజారోగ్యశాఖ కార్యనిర్వాహక ఇంజనీరు పి.సుగుణాకర్‌రావు, ఏపీఎంఐడీసీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు […]
ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు సారథి న్యూస్, మెదక్: వానాకాలం పంట సీజన్‌కు సంబంధించి జూన్ 10వ తేదీ నాటికి రైతుబంధు పైసలను రైతుల ఖాతాల్లో జమచేస్తామని మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలో రైతులకు నియంత్రిత సాగుపై ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ప్రసంగించారు. రాష్ట్రంలో 1.40 కోట్ల ఎకరాలకు సంబంధించి రైతులకు రైతుబంధు కోసం రూ.ఏడువేల కోట్లు అవసరం ఉండగా, ఇప్పటికే రూ.3,500 కోట్లు వ్యవసాయశాఖకు ఇచ్చినట్టు వెల్లడించారు. మరో రూ.3,500 కోట్లు అవసరం […]
మంత్రికి తీర్మానపత్రం అందజేస్తున్న నస్కల్ గ్రామ రైతులు
సారథి న్యూస్, ఖమ్మం: ఖమ్మం పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు ఆదివారం ఏఆర్ అడిషనల్ డీసీపీ మాధవరావు పర్యవేక్షణలో హోంగార్డు ఆఫీసర్స్ యూనిట్ ఆఫీసులో హోంగార్డులకు శానిటైజర్స్, మాస్క్‌లను ఆర్ఐ సాంబశివరావు నుంచి పంపిణీ చేశారు. విధుల నిర్వహణలో ఉండే హోంగార్డ్స్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఏఆర్ ఎస్సై కృష్ణారావు,హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, పుల్లయ్య, హోంగార్డ్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుధాకర్, సెక్రటరీ మహమ్మద్ రఫీ, జాయింట్ సెక్రటరీ బంక శీను, నీరజ, వెంకటేశ్వర్లు, […]
సిద్ధమైన వరల్డ్ ఫెడరేషన్ న్యూఢిల్లీ: పోస్ట్ కరోనాలో బ్యాడ్మింటన్‌ను మొదలుపెట్టేందుకు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్)రెడీ అయింది. అందుకోసం ఈ ఏడాది మిగిలిన టోర్నీలకు సంబంధించి రివైజ్డ్ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆగస్ట్ 11 నుంచి 16 వరకు జరుగనున్న హైదరాబాద్ ఓపెన్‌తో బ్యాడ్మింటన్ క్రీడ మొదలుకానుంది. నవంబర్ 17–22వ తేదీ వరకు సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టోర్నీ జరగనుంది. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ ఇండియా ఓపెన్‌కు డిసెంబర్ 8న తెరలేవనుంది. ఓవరాల్‌గా ప్రధానమైన […]
సీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ మెల్బోర్న్: అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నా.. ఈ ఏడాది చివరిలో జరిగే ఆసీస్‌లో ఇండియా పర్యటనకు ఎలాంటి ఇబ్బందుల్లేవని క్రికెట్ ఆస్ర్టేలియా(సీఏ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ కెవిన్ రాబర్ట్స్ అన్నాడు. ఇప్పుడున్న అనిశ్చితి పరిస్థితులను తొలిగించడానికి అన్ని చర్యలు చేపడతామన్నాడు. ‘ఇప్పటికిప్పుడు భారత్.. ఆసీస్‌కు వస్తుందా? లేదా? అంటే చెప్పలేం. కానీ షెడ్యూల్ టైమ్ వరకు కచ్చితంగా పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటన కొనసాగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే మ్యాచ్‌ల […]
క్రికెట్ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు క్రిస్ నెన్జానీ జొహన్నెస్‌బర్గ్: ఐసీసీ చైర్మన్‌గా కొత్త వ్యక్తికి మద్దతిచ్చే ముందు తమ దేశబోర్డు ప్రోటోకాల్ పాటించాలని క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) అధ్యక్షుడు క్రిస్ నెన్జానీ అన్నారు. తద్వారా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఐసీసీ చైర్మన్‌గా గంగూలీ రావాలన్నా ప్రొటీస్ క్రికెట్ డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ వ్యాఖ్యలకు నెన్జానీ కౌంటర్ ఇచ్చారు. ‘ఐసీసీతో పాటు మన వ్యక్తిగత ప్రొటోకాల్‌ను కూడా ప్రతిఒక్కరూ పాటించాలి. ఏ అభ్యర్థికి మద్దతు అందరూ కలిసి […]