Breaking News

Day: May 1, 2020

సామాజిక దూరం తప్పనిసరి

సామాజిక దూరం తప్పనిసరి

–    ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్​ రితిరాజ్ సారథి న్యూస్, షాద్ ​నగర్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా షాద్​నగర్​ పట్టణ ప్రజలు సామాజిక దూరాన్ని కచ్చితంగా పాటించాలని స్థానిక పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్​ రితిరాజ్ సూచించారు. కరోనా నివారణపై 8వ తరగతి విద్యార్థిని లోకేశ్వరి రూపొందించిన పోస్టర్లను ఆమె ఆవిష్కరించారు. కిరాణాషాపులు, ఇతర సముదాయాల వద్ద  ప్రజలు తప్పకుండా సామాజిక దూరం పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై విజయ్ భాస్కర్, […]

Read More
ఊళ్లకు వెళ్లేందుకు అనుమతి

ఊళ్లకు వెళ్లేందుకు అనుమతి

సారథి న్యూస్, నాగర్​ కర్నూల్: లాక్​ డౌన్​ నేపథ్యంలో జిల్లాలో ఉండిపోయిన వలస కార్మికులు, విద్యార్థులను వారివారి స్వస్థలాలకు తరలించేందుకు నోడల్ ఆఫీసర్లుగా అఖిలేష్ రెడ్డి, అనిల్ ప్రకాష్ ను నియమించినట్లు నాగర్​ కర్నూల్​ జిల్లా కలెక్టర్ శ్రీధర్ శుక్రవారం తెలిపారు. వలస కార్మికుల కోసం అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతినిస్తున్నట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయని, అందుకు జిల్లాస్థాయిలో నోడల్ అధికారులను నియమించామని పేర్కొన్నారు. మండలాల వారీగా కలెక్టరేట్​లో వివరాలను ఆయా నోడల్ ఆఫీసర్లు సేకరించారన్నారు. జిల్లాలో […]

Read More
వారి సేవలు మరువలేనివి

వారి సేవలు మరువలేనివి

సారథి న్యూస్, నాగర్​ కర్నూల్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో వైద్యులు, పోలీసులతో పాటు పారిశుద్ధ్య కార్మికులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కొనియాడారు. శుక్రవారం మే డే సందర్భంగా తగిన గౌరవం, గుర్తింపు ఇవ్వాలన్న ఉద్దేశంతో వారితో కలిసి సహపంక్తి భోజనం ఏర్పాటుచేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. 15 రోజులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ బాబురావు వారి మిత్రబృందం మున్సిపల్ కార్మికులకు అన్నదానం నిర్వహించడంతో అభినందించారు. కరోనా కట్టడికి […]

Read More

పిడుగుపాటుకు ఎద్దు మృతి

సారథి న్యూస్, చేవెళ్ల: ఉరుముల, మెరుపులతో భారీవర్షం పడడంతో పిడుగు పడి ఎద్దు మృతిచెందిన సంఘటన చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు మొగులయ్య కాడెద్దులను పొలంలో కట్టేశాడు. శుక్రవారం సాయంత్రం వర్షం కురవడంతో పిడుగు పాటుకు ఎద్దు చనిపోయింది. తనను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నాడు.

Read More

కార్మికుల వివరాలు సేకరించాలె

సారథి న్యూస్​, వెల్దండ: కరోనా వ్యాప్తి.. లాక్​ డౌన్​ నేపథ్యంలో నాగర్​ కర్నూల్​ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని శ్రీశైలం– హైదరాబాద్ హైవేపై ఏర్పాటు చేసిన పోలీస్ చెక్ పోస్ట్ ను శుక్రవారం డీఆర్వో మధుసూదన్ నాయక్, ఆర్డీవో రాజేష్ కుమార్ తో కలిసి పరిశీలించారు. ఇతర రాష్ట్రాల వలస కార్మికుల వివరాలు సేకరించాలని, మండలంలో ఉన్న వలస కూలీలు తమ సొంత ప్రాంతాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా తహసీల్దార్​ అనుమతి తీసుకోవాలని సూచించారు. రోడ్లపై అనవసరంగా తిరుగుతున్న […]

Read More

పింఛన్లు పంపిణీ

సారథి న్యూస్, శ్రీకాకుళం: వైఎస్సార్​ పింఛన్​ కానుక కింద శ్రీకాకుళం జిల్లాలో రూ.87.38 కోట్లు పంపిణీ చేశామని జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాలకుడు ఏ.కళ్యాణ చక్రవర్తి తెలిపారు. శుక్రవారం ఆయన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. జిల్లాలో 3,65,334 మందికి రూ.87.38 కోట్ల పంపిణీకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలో వలంటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసినట్లు తెలిపారు.

Read More
వలస కార్మికుల లిస్టు రెడీ చేయండి

వలస కార్మికుల లిస్టు రెడీ చేయండి

సారథి న్యూస్​, మహబూబ్​ నగర్​: కరోనా కారణంగా ఇప్పటి వరకు ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయి జిల్లాకు వస్తున్న వలస కార్మికులపై ప్రత్యేకదృష్టి పెట్టాలని మహబూబ్​ నగర్​ జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కలెక్టరేట్​ లో వారితో సమీక్షించారు. జిల్లా నుంచి వెళ్లేవారి లిస్టును రెడీ చేయాలని సూచించారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారందరినీ హోం క్వారంటైన్​ లో ఉంచాలని, ఎవరికైనా కరోనా అనుమానిత లక్షణాలు గుర్తించినట్లయితే ప్రభుత్వ ఆస్పత్రి, ఎస్​వీఎస్​ ఆస్పత్రికి […]

Read More
కూలీలు ఆకలితో బాధపడొద్దు

కూలీలు ఆకలితో బాధపడొద్దు

సారథి న్యూస్​, గోదావరిఖని: లాక్​ డౌన్​ నేపథ్యంలో సొంత రాష్ట్రాలకు వెళ్తున్న వలస కూలీలకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లా చౌరస్తాలో ఏర్పాటుచేసిన అన్నదానం కార్యక్రమాన్ని సీపీ సత్యనారాయణ శుక్రవారం ప్రారంభించారు. పేదలకు ఇబ్బందులు పడకూడదనే భోజనాలు పెట్టిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, పట్టణ సీఐ మూర్తిలింగయ్య, మంచిర్యాల రూరల్ సీఐ కృష్ణ కుమార్, మంచిర్యాల పట్టణ ఎస్సైలు ప్రవీణ్ కుమార్ మారుతి, మార్వాడి అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Read More