గ్రామపంచాయతీల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి రూ.8500 వేతనం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జీతాన్ని ప్రతినెల 1వ తేదీనే చెల్లించాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఆఫీసు తాజాగా ఆదేశించింది. పంచాయతీలకు ప్రతినెలా విడుదలవుతున్న రూ.336 కోట్ల నుంచి వీటిని చెల్లించువకోవచ్చని మార్గదర్శకాలు జారీచేసింది. ఈ నిబంధనలు పాటించని పంచాయతీలపై తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018 ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించింది.
సారథి న్యూస్, హైదరాబాద్: రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ వెబ్ సైట్ లో పెట్టింది. ఆ జాబితాలో పేరు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం కింద ఏడాదికి రూ.ఆరువేలు అందుతాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా అర్హత సాధించిన వారితో సహా లబ్ధిదారుల పేర్లు అప్ డేట్ చేసింది. మరి ఆ […]
సారథి న్యూస్, రంగారెడ్డి: కరోనా లక్షణాలతో ఉన్న ఓ ప్రయాణికుడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరో 58 మంది హమాలీ కార్మికులను హోమ్ క్వారంటైన్ కు పంపించారు. రాజస్థాన్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండకు గన్నీ బ్యాగ్స్ లోడ్ తో వచ్చిన లారీలో ఎక్కిన ఓ ప్రయణికుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతడు ప్రయాణించిన లారీ విషయమై పోలీసులు ఆరా తీయగా వలిగొండ లో ఉన్నట్లు గుర్తించి డ్రైవర్, క్లీనర్లను రంగారెడ్డి జిల్లా రావిరాల […]
సారథి న్యూస్, మహబూబ్‌నగర్: కరోనా సమయంలో పేదలను ఆదుకునేందుకు వివిధ సంస్థలు, వ్యక్తులు, ఉద్యోగులు ముందుకు రావడం అభినందనీయమని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ కొనియాడారు. ఆదివారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సుబ్రమణ్య కాలనీ, పాలకొండతండా ప్రాంతాల్లో సరుకులు పంపిణీ చేశారు. కష్టకాలంలో వలస కూలీలను ఆదుకోవాలనే సంకల్పంతోనే వారికి బియ్యం, కూరగాయలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పట్టణంలోని మెట్టుగడ్డ వద్ద ఉన్న ఆర్వీఎం భవనం ఎదుట బహుజన తరగతుల ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పేదలకు […]
సారథి న్యూస్, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) ఆదివారం జిల్లాలో పర్యటించారు. మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ తో కలసి పాజిటివ్ కేసులు వచ్చిన పాతపట్నం ప్రాంతాన్ని పరిశీలించారు. కంటైన్మెంట్ ప్రాంతాలకు వచ్చేందుకు, పోయేందుకు ఒకటే మార్గం ఉండాలన్నారు. జిల్లా కలెక్టర్ జె.నివాస్ కంటైన్ మెంట్ జోన్ […]
సారథి న్యూస్, హైదరాబాద్: కరోనాను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం క్షేత్రస్థాయి చర్యలకు ఉపక్రమించింది. ప్రజలను అవగాహన కల్పించి మహమ్మారికి అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే జలశక్తి శాఖ అదనపు కార్యదర్శి అరుణ్ భరోక నేతృత్వంలో కేంద్ర అంతర్ మంత్రిత్వ శాఖల అధికారుల బృందం ఆదివారం హైదరాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించింది. మొదట మెహిదీపట్నం రైతు బజార్‌ను సందర్శించింది. రైతు బజార్‌లో నిత్యావసర వస్తువులను విక్రయిస్తున్న కిరాణ షాపును పరిశీలించి అమ్మకాల గురించి షాపు యజమానితో మాట్లాడారు. […]
సారథి న్యూస్, అలంపూర్: జోగుళాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పోలీస్ చెక్ పోస్ట్ వద్ద పోలీస్ సిబ్బంది, విలేకరులకు జడ్పీ చైర్ పర్సన్ సరిత ఆదివారం సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ హనుమంతురెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ధర్మవరం రంగారెడ్డి, ఎంపీపీ స్నేహ, వైస్ ఎంపీపీ సుజాత, షేక్ పల్లి సర్పంచ్ రవీందర్ రెడ్డి, ఎర్రవల్లి ఎంపీటీసీ ఎల్కుర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, మెదక్: ప్రభుత్వం సూచించిన ఆదేశాలను పాటిస్తూ ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించాలని, అప్పుడే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని మార్కెట్, న్యూ బస్టాండ్ లో ఏర్పాటుచేసిన కూరగాయల, మటన్ మార్కెట్ తో పాటు వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ఏర్పాటుచేసిన చేపల మార్కెట్ ను మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కమిషనర్ శ్రీహరితో కలిసి పరిశీలించారు. అమ్మకాలు జరిపే వారు […]