సారథి న్యూస్, అలంపూర్: మూడు రోజుల క్రితం మృతిచెందిన అలంపూర్ కు చెందిన ఆర్ఎంపీ తిమ్మప్ప మృతికి శనివారం రాత్రి కొవ్వొత్తులు వెలిగించి సంతాపం తెలిపారు.అలంపూర్ లో పేదల వైద్యుడిగా గుర్తింపు పొందిన ఆయన మృతి తీరని లోటని ప్రముఖ న్యాయవాది నాగరాజు యాదవ్ అన్నారు.అలాగే పట్టణ ప్రజలంతా స్వచ్ఛందంగా వారి ఇళ్ల వద్ద భౌతిక దూరం పాటిస్తూ కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మనోరమ వెంకటేష్ పాల్గొన్నారు.
సారథి న్యూస్, రంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రంలో శనివారం ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఉదయం ఆరు కాగా, సాయంత్రం ఒకటి చొప్పున కేసు నమోదైంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 25 మంది చనిపోయారని పేర్కొంది. 307 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ఇప్పటి వరకు 990 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.
సారథి న్యూస్, రంగారెడ్డి : లాక్ డౌన్ నేపథ్యంలో పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు అందజేసి మానవత్వంతో ఆదుకోవాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గజ్జి భాస్కర్ యాదవ్ పిలుపునిచ్చారు. శనివారం హయత్ నగర్ డివిజన్ లోని ద్వారకమైనగర్ కాలనీకి చెందిన 70 కుటుంబాలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో పరిశుభ్రత, భౌతిక దూరం పాటిస్తే కరోనాను నిర్మూలించవచ్చని సూచించారు. నిరుపేదల బాధలను తెలుసుకుని వారికి నిత్యావసర సరుకులు […]
అక్షయ తృతీయ వచ్చేసింది.. లాక్ డౌన్ నేపథ్యంలో కొనుగోళ్లకు బ్రేక్ ఇప్పటికే ఆరోగ్య, ఆర్థిక రంగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న కరోనా తాజాగా భారతీయుల సెంటిమెంటుపైనా ఎఫెక్ట్ చూపిస్తోంది. అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేసే సెంటిమెంట్‌ను భారతీయులు పెద్ద ఎత్తున పాటిస్తారు. తాజా లాక్ డౌన్, ఫిజికల్ డిస్టెన్స్ వంటి నిబంధనలు, పరిమితుల నేపథ్యంలో అక్షయ తృతీయ సెంటిమెంట్ కొనసాగించడం కష్టంగా మారింది. లాక్ డౌన్ ఎఫెక్ట్కరోనా వ్యాప్తితో మార్చి 25 నుంచి ఏప్రిల్ […]
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ లోని పెద్ద పులులు, ఇతర వన్యప్రాణుల రక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ సాయిశేఖర్ తో కలిసి వన్యప్రాణులకు కల్పించిన వసతులను పరిశీలించారు. అనంతరం దోమలపెంట గెస్ట్ హౌస్ లో అటవీ అధికారులతో సమీక్షించారు. ఇటీవల అమెరికాలోని బ్రాంగ్జ్ జూపార్క్ లో నాలుగేళ్ల పులికి వైరస్ సోకిన నేపథ్యంలో అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ నల్లమలలో […]
సారథి న్యూస్, శ్రీకాకుళం : మానవ సమాజ రక్షణకు కలిసికట్టుగా కరోనా మహ్మారిని తరిమేద్దామని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పిలుపునిచ్చారు. శనివారం ఆర్ బీ గెస్ట్ హస్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాను ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలని కోరారు. రాజకీయాలకు తావు లేకుండా విపత్తును ఎదుర్కోవడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. స్వీయ నియంత్రణ పాటిస్తూ జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాలను ప్రజలు తప్పకుండా పాటించాలన్నారు.
సారథి న్యూస్, శ్రీకాకుళం: కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో పాతపట్నం మండలంలో లాక్ డౌన్ ను మరింత కఠినం చేస్తున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ స్పష్టం చేశారు. జిల్లాలో మూడు పాజిటీవ్ కేసులు నమోదవ్వడంతో అన్నిశాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. శనివారం కలెక్టర్ జె.నివాస్ మీడియాతో మాట్లాడుతూ పాతపట్నం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ నుంచి రాగానే పరీక్షలు నిర్వహిస్తే పాజిటీవ్ గా వచ్చిందని, కాకినాడ తుది ఫలితాల కోసం పంపించగా నెగిటీవ్ […]
సారథి న్యూస్, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా సరిహద్దులపై గట్టినిఘా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. శనివారం జిల్లా పరిధిలోని ఈగలపెంట వద్ద ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ ను ఎస్పీ డాక్టర్ వై.సాయిశేఖర్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు రెండు కనోనా పాజిటివ్ కేసులు నమోదైనప్పటికీ పూర్తిస్థాయిలో కరోనాను కట్టడి చేశామన్నారు. జిల్లాకు తూర్పు శ్రీశైలం, ప్రకాశం, గుంటూరు, నల్గగొండ జిల్లాలు, పడమర మహబూబ్ […]