సామాజిక సారథి, హన్మకొండ: హన్మకొండలోని వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని ధర్మసాగర్ మండల టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మునిగాల రాజు కలిసి అభినందించారు. అనంతరం హన్మకొండలోని అదాలత్ సెంటర్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళలర్పించారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని శాలువతో సత్కరించి, పుష్పగుచ్ఛంతో శుభాకాంక్షలు తెలిపారు.
సారథి న్యూస్, హుస్నాబాద్: ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండగ రంజాన్ అని ఎమ్మెల్యే సతీష్ కుమార్ కుమార్ అన్నారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మైనార్టీ సంక్షేమానికి ప్రత్యేకమైన నిధులను కేటాయించి వారి అభ్యున్నతికి ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. అనంతరం నియోజకవర్గ పరిధిలోని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రజిత, వైస్ చైర్ పర్సన్ అనిత, డైరెక్టర్ ఆఫ్ లేబర్ కోపరేటివ్ ఆఫ్ ఇండియా […]