Breaking News

రైతులు

ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి

ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి

ఎండుమిర్చిన తీసుకెళ్తుండగా ఘటన.. మృతులు రైతులు సారథి న్యూస్, రంగారెడ్డి: అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో ఇద్దరు రైతులు మృతిచెందారు. ఈ సంఘటన మాడ్గుల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం.. నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలం, శాంతిగూడెం గ్రామానికి చెందిన రామచంద్రయ్య(45), సుబయ్య(36) కలిసి ఎండు మిర్చిని ట్రాక్టర్​ లో ఇర్విన్ గ్రామానికి తీసుకొచ్చారు. తిరిగి వెళ్తుండగా అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ఘటనలో రామచంద్రయ్య, సుబ్బయ్య […]

Read More
రైతులు ఇబ్బందులు పడొద్దు

రైతులు ఇబ్బందులు పడొద్దు

సారథి న్యూస్, నాగర్ కర్నూల్: వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు, కూలీలు సామాజిక దూరం పాటించాలని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ మనుచౌదరి ఆదేశించారు. బుధవారం బిజినేపల్లి మండలంలోని లింగసానిపల్లి, కారుకొండ గ్రామాల్లో కొనసాగుతున్న వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. లింగసానిపల్లిలో 6,440 బస్తాలు, కారుకొండలో 1,807 బస్తాల వరి ధాన్యాన్ని కొనుగోలు చేశారని చెప్పారు. జిల్లావ్యాప్తంగా 211 కొనుగోలు కేంద్రాల్లో 43,264 మెట్రిక్ టన్నుల […]

Read More
రైతు గుండెల్లో 'పిడుగు'

రైతు గుండెల్లో ‘పిడుగు’

సారథి న్యూస్, రామడుగు, మహబూబ్ నగర్: రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మంగళవారం సాయంత్రం అకాలవర్షం రైతన్నలను ఆగమాగం చేసింది. చేతికొచ్చిన పంట నీటిపాలైంది. మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన ధాన్యం తడిసి పోయింది. అలాగే పిడుగు పాటు వణికించింది. కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కురిసిన అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం నీట తడిసి ముద్దయింది. ఆరబోసిన ధాన్యం సైతం కొట్టుకుపోయింది. పొలాల్లో కోతలకు ఉన్న వరి నేలకొరిగింది. […]

Read More
‘పీఎం కిసాన్’ కొత్త లిస్టు విడుదల

‘పీఎం కిసాన్’ కొత్త లిస్టు విడుదల

సారథి న్యూస్​, హైదరాబాద్​: రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకానికి సంబంధించి అర్హుల జాబితాను కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ వెబ్ సైట్ లో పెట్టింది. ఆ జాబితాలో పేరు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం కింద ఏడాదికి రూ.ఆరువేలు అందుతాయి. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా అర్హత సాధించిన వారితో సహా లబ్ధిదారుల పేర్లు అప్ డేట్ చేసింది. మరి ఆ […]

Read More
రైతులకు అండగా ప్రభుత్వం

రైతులకు అండగా ప్రభుత్వం

సారథి న్యూస్, దుబ్బాక: రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ఈనెల 19న దుబ్బాక మున్సిపల్ పరిధిలోని చేల్లాపూర్ వార్డులో రైతు మట్ట బుచ్చిరెడ్డి(36) పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. బాధిత కుటుంబానికి గురువారం ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.ఆరులక్షల చెక్కును అందజేశారు.

Read More

ఆకలి.. పోరాటం

సారథి న్యూస్, మహబూబ్​ నగర్​: కరోనా విజృంభిస్తున్న వేళ కూలీలు, మేస్త్రీలు, రైతులు, కార్మికులు, హమాలీలు, డ్రైవర్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే రెక్కాడితే గానీ డొక్కాడని బక్కజీవులకు పనులు దొరకడం లేదు. చాలా మంది తమ పనులకు తాత్కాలిక విరామం ఇచ్చి ఇంటి పట్టునే ఉంటున్నారు. అయితే సాధారణ రోజువారీ కూలీలు పూట గడవక ఇబ్బందులు పడుతున్నారు. అయితే నెత్తిన పెద్ద బండరాయిని మోస్తూ.. మండు టెండలో బక్కచిక్కిన దేహంతో నడుస్తూ వెళ్తున్న ఓ పెద్దమనిషి సోమవారం […]

Read More