బారాముల్లా: జమ్మూకాశ్మీర్ బారాముల్లా జిల్లాలోని నౌగామ్‌లో సెక్యూరిటీ ఫోర్స్, టెర్రరిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. లైన్‌ఆఫ్ కంట్రోల్ వద్ద ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరగడం గమనించిన సెక్యూరిటీ ఫోర్స్ వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయని అన్నారు. మరికొంత మంది తప్పించుకున్నారనే అనుమానంతో ఏరియా మొత్తం కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని అధికారులు చెప్పారు. వారి నుంచి ఏకే 47 గన్‌తో పాటు కొన్ని ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఏడాది […]
చెన్నై: తన కెరీర్ మొత్తంలో 1999లో జరిగిన భారత పర్యటన చాలా ప్రత్యేకమైందని పాకిస్తాన్ దిగ్గజ బౌలర్ వసీం అక్రమ్ అన్నాడు. దాదాపు 10ఏళ్ల విరామం తర్వాత, భారత్– పాక్ టెస్ట్ సిరీస్‌లో మ్యాచ్ గెలవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. ‘ఆ పర్యటనకు నేను కెప్టెన్‌ను. చెన్నైలో తొలి టెస్ట్. పరిస్థితులన్నీ భిన్నంగా ఉన్నా.. మేం బాగా ఆడాం. దీంతో మ్యాచ్ గెలిచాం. ఇండో–పాక్ చరిత్రలో ఇదే తొలి విజయం కావడంతో మా ఆనందం రెట్టింపు అయింది. […]
లాహోర్: పాకిస్థాన్ బ్యాట్స్ మెన్ ఉమర్ అక్మల్ పై ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) మూడేళ్ల బ్యాన్ విధించింది. పీఎస్‌ఎల్ ఆరంభానికి ముందు మ్యాచ్ ఫిక్సర్లు తనను కలిసిన విషయాన్ని వెల్లడించనందుకు అతనిపై ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఈ నిషేధం ఫిబ్రవరి 20వ తేదీ నుంచే అమల్లోకి వస్తుందని పీసీబీ వెల్లడించింది. ఫిక్సర్లు కలిసిన విషయాన్ని బోర్డు దృష్టికి తీసుకురావాలన్న అవినీతి నిరోధక నిబంధనలను ఉల్లంఘించినందుకు పీసీబీ క్రమశిక్షణ కమిటీ ఈ చర్యలకు ఉపక్రమించింది. […]