సారథి న్యూస్, రామడుగు: వర్షంతో నష్టపోయిన రైతన్నలు వెంటనే ఆదుకోవాలని సీపీఐ జిల్లా సహాయకార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆయన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం పర్యటించి పంటలను పరిశీలించారు. వర్షాలతో రైతులు ఎంతో నష్టపోయారని పేర్కొన్నారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నేతలు గంటే రాజేశం, మచ్చ రమేశ్, బాల్ రెడ్డి, నాగి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
సారథిన్యూస్, ఖమ్మం/ఏన్కూర్: వర్షాలతో సర్వస్వం కోల్పోయిన రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లా ఏన్కూర్ మండలం భగవాన్ నాయక్ తండాలో పర్యటించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరావు, కార్యదర్శివర్గ సభ్యులు భూక్యా వీరభద్రం, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు బొంతు రాంబాబు, ఎస్ఎఫ్ఐ […]