సారథి న్యూస్, పెద్దశంకరంపేట: మెదక్ జిల్లాలోని అన్నీ పాఠశాలల్లో ఆన్ లైన్ పాఠాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని మెదక్ డీఈవో రమేశ్ కుమార్ తెలిపారు. స్థానిక జడ్పీ హైస్కూలులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. తల్లిదండ్రుల్లో కూడా ఆన్ లైన్ తరగతుల పట్ల అవగాహన వచ్చిందన్నారు. స్కూలు తెరచిన తర్వాత సుమారు మూడువేల మంది తల్లిదండ్రులు స్మార్ట్ ఫోనో, లేక టీవీనో కొనుక్కోవడం చేశారని చెప్పారు. వారి పిల్లలకు ఆన్లైన్ లో తరగతుల కోసం ఉత్సాహం చూపుతున్నారని చెప్పారు. టీచర్లు […]

సారథి న్యూస్, మానవపాడు: తెలంగాణ ప్రైవేట్టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో జోగుళాంబ గద్వాల జిల్లా డీఈవో ఆఫీసు ఎదుట ఆందోళనకు దిగారు. ఆరునెలల పెండింగ్జీతాలు చెల్లించాలని డిమాండ్చేశారు. కష్టకాలంలో తాము ఎలా బతకాలని ప్రశ్నించారు. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలతో ప్రభుత్వం మాట్లాడి తమకు వేతనాలు ఇప్పించాలని కోరారు. జీతాలు రాకపోవడంతో కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నామని వాపోయారు.
సారథి న్యూస్, ఆదిలాబాద్: ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు హెచ్ఎంలు, టీచర్లకు ఆన్ లైన్ శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ డీఈవో ఏ.రవీందర్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీ సంస్థలు సంయుక్తంగా కోవిడ్ –19 మానసిక సంసిద్ధతపై క్లాసెస్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని స్కూళ్ల నుంచి టీచర్లు హాజరుకావాలని సూచించారు. ఈనెల 17వ తేదీలోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.