సామాజికసారథి, శివ్వంపేట: మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రానికి చెందిన ముద్దగల్ల అంజయ్య కుమారుడు శ్రీకాంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా బుధవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. తనవంతు సహాయంగా తన సొంత డబ్బులు రూ.ఐదువేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. రోడ్డు ప్రమాదంలో శ్రీకాంత్ గాయపడటం బాధాకరమని, ఆయన కుటుంబానికి తామంతా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పద్మ వెంకటేశ్, గ్రామ కమిటీ […]
సారథి న్యూస్, వాజేడు: ‘నాకు ప్రశ్నించే అధికారం లేదా..? నేను ఓ ప్రజాప్రతినిధిని కాదా?, కనీసం నాకు విలువ లేదా?’ అని కన్నీరుమున్నీరయ్యారు ములుగు జిల్లా వాజేడు ఎంపీపీ శ్యామల శారద. మంగళవారం ఆమె జడ్పీటీసీ సభ్యురాలు తల్లడి పుష్పలతతో కలిసి స్థానిక ఎంపీడీవో ఆఫీసులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎంపీడీవో చంద్రశేఖర్ పై విమర్శలు గుప్పించారు. పల్లెల్లో జరిగే పలు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తికావాలనే ఉద్దేశంతో క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్తే తమను […]