సామాజిక సారథి, జడ్చర్ల: మండలంలో ఇటుక బట్టీల యజమానితో చిత్రహింసలకు గురవుతున్నారని ఒడిశా వలస కూలీల ఘటనపై జిల్లా అధికారుల ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు అప్రమత్తమై విచారణ చేపట్టారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం దేవుడి గుట్ట సమీపంలో ఇరవైరోజుల క్రితం మాధవరావు అనే కాంట్రాక్టర్ ఇటుక బట్టీలను తయారు చేసేందుకు ఒడిశా రాష్ట్రం నుంచి ఓ మధ్యవర్తి ద్వారా సుమారు 13మంది వలస కూలీలను తీసుకొచ్చారు. ఓ వలసకూలీ తమను ఇటుక […]
ఉద్దండాపూర్ గ్రామస్తులకు న్యాయం చేయాలి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క రైతులతో ముఖాముఖి సారథి న్యూస్, జడ్చర్ల: నాటి ఇందిరమ్మ ప్రభుత్వం దళిత, గిరిజన పేదప్రజలకు భూములు ఇస్తే సీఎం కేసీఆర్ గుంజుకుంటున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో పర్యటించారు. రైతులతో మాట్లాడిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్దండాపూర్ గ్రామస్తులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని […]
సారథి న్యూస్, జడ్చర్ల: కర్వెన రిజర్వాయర్ ఓపెనింగ్ కు ఊర్కొండ మండలం జగబోయిన్పల్లి సర్పంచ్ పిలుపు మేరకు ర్యాలీకి వెళ్లి ట్రాక్టర్ బోల్తాపడి మృతి చెందిన ఎర్రోళ్ల రాజు కుటుంబానికి ఆదుకోవాలని జై భీమ్ యూత్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు జంతుక శంకర్ డిమాండ్ చేశారు. ప్రమాద జరిగిన స్థలంలో టీఆర్ఎస్ నాయకులు కనీసం పట్టించుకోలేదన్నారు. ఏడునెలల క్రితమే రాజుకు వివాహమైందని, తన భార్య ఏడునెలల గర్భిణిగా ఉందన్నారు. ఈ ఘటనకు జడ్చర్ల ఎమ్మెల్యే నైతిక బాధ్యత […]
సారథి న్యూస్, షాద్నగర్: కాంగ్రెస్ సీనియర్ నేత, జడ్చర్ల మాజీ సింగిల్ విండో చైర్మన్ రామచంద్రారెడ్డి అలియాస్ పెట్రోల్ పంపు రామచంద్రారెడ్డి శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో కిడ్నాప్, హత్యకు గురయ్యారు. కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామ సమీపంలో రామచంద్రారెడ్డిని ఆయన బంధువైన అన్నారం ప్రతాప్ రెడ్డి మరొకరు కలిసి హత్య చేసినట్లు షాద్ నగర్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, ఏసీపీ వి.సురేందర్ వెల్లడించారు. తెలిపారు. ఈ హత్యకు సంబంధించిన ప్రాధమిక పూర్వాపరాలను […]
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో… సారథి న్యూస్, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల కేంద్రంలో తెలంగాణ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత భోజనాన్ని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ మంగళవారం ప్రారంభించారు. ప్రతిఒక్కరూ సోషల్ డిస్టెన్స్ పాటించేలా చూడాలని సూచించారు. సేవాభావంతో అన్నదానం చేస్తున్న టీచర్లను మంత్రి అభినందించారు.