యువకుడి సేవాస్ఫూర్తి సొంత ఖర్చుతో రోడ్డుపై గుంతల పూడ్చివేత అభినందన తెలిపిన వాహనదారులు సామాజిక సారథి, వర్ధన్నపేట: నిత్యం మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉన్నతాధికారులు వెళ్లే జాతీయ రహదారి అది. ప్రతిరోజూ వందలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రధాన మార్గం. ఆ హైవేపై గుంతలు ఏర్పడి ప్రయాణికులకు ప్రాణసంకటంగా మారాయి. ఎన్నో ప్రమాదాలు కూడా జరిగాయి. కానీ ఎవరూ పట్టించుకున్న దాఖలాల్లేవ్. ఎవరూ బాధ్యతగా ముందుకొచ్చి ఆ గుంతలను పూడ్చే ప్రయత్నమూ చేయలేదు. కానీ ఐనవోలు […]
సామాజిక సారథి, నల్లగొండ: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నల్లగొండ జిల్లా యువజన విభాగం కన్వీనర్ గా నల్లగొండకు చెందిన యువజన నాయకుడు సింగం లక్ష్మి నారాయణ నియామకమయ్యారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిళ ఆదేశాలతో నల్గొండ పార్లమెంటరీ కన్వీనర్ పిట్ట రామ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సింగం లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ముందుకు తీసుకపోతూ తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేయడం సంతోషంగా ఉందని, నల్లగొండ […]
సారథి న్యూస్, హెల్త్‌డెస్క్: ఇటీవల పెద్దలు, మధ్యవయస్సువాళ్లు కూడా నిద్రలేమితో బాధపడుతున్నారు. నిద్రలేమితో ఎన్నో ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయని వైద్యులు సూచిస్తున్నారు. స్మార్ట్ఫోన్లకు బానిసలుగా మారుతున్న యువత సరైన నిద్రలేకపోవడంతో డిప్రెషన్, తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు 8గంటలపాటు నిద్రించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. కొన్ని సులభమైన చిట్కాలు పాటించి నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు. రాత్రి పడుకొనేముందు ఒక అరటిపండు తింటే శరీరంలో అన్ని అవయవాలకు క్రమపద్ధతిలో రక్తం సరఫరా అవుతుంది. దీనివల్ల […]
సారథి న్యూస్, చొప్పదండి: మథర్ థెరిస్సా సేవలు మరువలేనివని ప్రముఖ సామాజిక వేత్త, కవి, రచయిత పసూల రవి కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం దేశాయిపేట్ గ్రామంలో బుధవారం మథర్ థెరిస్సా జయంతి పురస్కరించుకుని గ్రామ యువకులు ‘మీకోసం.. మేము’ అనే స్వచ్ఛంద సేవాసమితిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత ఈ ఫౌండేషన్ స్థాపించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గుంట రవి, ఉప సర్పంచ్ వెంకట్రామిరెడ్డి, వార్డుసభ్యులు మోర వెంకటరమణ, కొలిపాక […]
ఇండోర్: ఓ పోకిరీ వేదవ తిక్కకుదిర్చేలా న్యాయమూర్తి వినూత్న తీర్పు చెప్పారు. దీంతో ఆ న్యాయమూర్తిపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. జడ్జీగారు మీరు సూపరండీ అంటున్నారు యువత. ఇంతకు ఆ జడ్జీ ఇచ్చిన తీర్పు ఏమిటంటే.. మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిని నగరానికి చెందిన విక్రమ్ బాగ్రి అనే ఓ ఆకతాయి ఓ వివాహిత (30) ఇంట్లోకి వెళ్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి […]
జెనీవా: కరోనాతో యువతకు ముప్పు ఉందని, దాన్ని లైట్ తీసుకోవద్దని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) వార్నింగ్ ఇచ్చింది. వైరస్‌ను లైట్ తీసుకుని సమ్మర్ హాలిడేస్‌ను ఎంజాయ్ చేయలనుకోవడం వల్లే కేసులు పెరిగాయని అన్నారు. ఈ విషయాన్ని గతంలోనే చెప్పామని, ఇప్పుడు మళ్లీ గుర్తుచేస్తున్నామని అన్నారు. వృద్ధులకు ముప్పు ఉన్నట్లే యువతకు కూడా ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. కరోనా బారినపడి యువకులు కూడా చనిపోయే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని డబ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ అధోనమ్ గెబ్రెయేన్ […]
సారథిన్యూస్, రామడుగు: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే రోగాలు దరిచేరవని యువజన సంఘం సభ్యులు చెప్పారు. ఆదివారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం కొక్కెరకుంట శివారులో రైజింగ్ సన్ యువజనసంఘం సభ్యులు స్వచ్ఛ భారత్ నిర్వహించారు. గ్రామంలో పేరుకుపోయిన చెత్తా, చెదారం తొలిగించారు. కార్యక్రమంలో రైజింగ్ సన్ యూత్ క్లబ్ అధ్యక్షులు గజ్జెల అశోక్, ప్రధాన కార్యదర్శి జేరిపోతుల మహేశ్, గజ్జెల నవీన్, ప్రశాంత్, రాజు కుమార్ పాల్గొన్నారు.
విక్టరీ వెంకటేశ్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న ‘నారప్ప’ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఓ పోస్టర్ యువతను తెగ ఆకట్టుకుంటున్నది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. తమిళంలో విజయవంతమైన ‘అసురన్’కు రీమేక్‌గా ఈ చిత్రం వస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో ధనుష్ నటించిన ఈ సినిమా అక్కడ భారీవిజయాన్ని సొంతం చేసుకున్నది. దళితుడి జీవితానికి సంబంధించిన కథతో ఈ చిత్రం తెరకెక్కింది. తమిళ మాతృకకు వెట్రిమారన్ దర్శకత్వం వహించాడు. […]