సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా కాలంలో చేనేత, మరమగ్గాల కార్మికులను ఆదుకోవాలన్న ప్రభుత్వ ఉద్దేశం పూర్తిగా నెరవేరకుండా పోతోంది. బ్యాంకుల నిబంధనలు వారికి రావాల్సిన డబ్బును అడ్డుకుంటున్నాయి. పలు రకాల కొర్రీలు, బుక్ అడ్జెస్ట్‌మెంట్ల వల్ల రాష్ట్రంలోని 4,200 మంది కార్మికులు తమకు అందాల్సిన సొమ్మును పొందలేకపోతున్నారు. చేనేత, మరమగ్గాల కార్మికుల సంక్షేమం కోసం 2018లో రాష్ట్ర ప్రభుత్వం త్రిఫ్ట్ ఫండ్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. 18వేల మంది చేనేత, 12 మంది పవర్‌లూమ్ కార్మికులు ఇందులో […]
సారథి న్యూస్, హైదరాబాద్: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఇద్దరు చేనేత కార్మికులకు పరిశ్రమల శాఖ కె.తారక రామారావు అవార్డులను ప్రదానం చేశారు. 18 మందిని ఎంపికచేయగా, మిగతా 16 మందికి ఆయా జిల్లాల కలెక్టర్ల చేత అందజేశారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి వర్చువల్ గా, ఆన్లైన్ లో వీక్షించి అవార్డు గ్రహితలతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేనేత కార్మికుల కోరిక మేరకు నేతన్నకు చేయూత పథకాన్ని కొనసాగించేందుకు ప్రతిపాదనలు పంపించాలని అధికారులను ఆదేశించారు. […]
ఉపాధి కోసం కూలి పనులకు వెళ్తున్న కార్మికులు చేతులు మొద్దు బారి నేత పని చేయలేకపోతున్నామని ఆవేదన ప్రభుత్వమే గిట్టుబాటు ధరలు కల్పించాలని వేడుకోలు సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి గ్రామం పేరు చెబితేనే చేనేత గుర్తుకొస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో నేత పనికి గుర్తింపు తెచ్చిన వాటిలో ఈ గ్రామం కూడా ఒకటి. అలాంటి ఊరులో చేనేత వృత్తే కనుమరుగయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వృత్తినే నమ్ముకుని కొన్నేళ్లుగా జీవనం […]
కరోనాతో చేనేత, జౌళి పరిశ్రమ విలవిల గోదాముల్లో రూ.400 కోట్ల విలువైన వస్త్రాలు పెట్టుబడుల్లేక చేతులెత్తేస్తున్న మాస్టర్ వీవర్స్ సారథి న్యూస్, హైదరాబాద్: కరోనా ప్రభావంతో రాష్ట్రంలోని చేనేత, జౌళి పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఆయా రంగాల మీద ఆధారపడి పనిచేస్తున్న రెండున్నర లక్షల మంది కార్మికులు ఇప్పుడు రోడ్డునపడినట్లయింది. సాధారణంగా ఈ సీజన్‌లో పెండ్లిండ్లు, ఇతర శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా చేనేత, మరమగ్గాల కార్మికులకు చేతినిండా పని ఉంటుంది. కానీ కరోనా దెబ్బకు […]