సామజిక సారథి, వాజేడు: సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు అధికంగా ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందడంతో వారు స్థానిక పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో 163 జాతీయ రహదారి పై గురువారం పేరూరు ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో విస్తృత వాహనాల తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ .సివిల్ కానిస్టేబుల్ . తదితరులు పాల్గొన్నారు.
– ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోరప్రమాదం సామాజికసారథి, హైదరాబాద్: హైదరాబాద్ నగర శివార్లలోని పెద్ద అంబర్ పేట ఔటర్ రింగురోడ్డుపై ఘోరప్రమాదం జరిగింది. ఓఆర్‌ఆర్‌పై వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ముందుగా వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారు, లారీ దగ్ధమయ్యాయి. అయితే రెండు వాహనాల్లో డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు […]
సారథి న్యూస్, కర్నూలు: నగరంలో ఇసుక బండ్ల కార్మికుల కడుపు కొట్టవద్దని రెండవ రోజు బుధవారం పాతబస్టాండ్ అంబేద్కర్ విగ్రహం ఎదుట సీఐటీయూ నాయకులు, కార్మికులు ఆందోళన చేపట్టారు. నగర ప్రధాన కార్యదర్శి ఎం.రామాంజనేయులు మాట్లాడుతూ తుంగభద్ర నది పరీవాహక ప్రాంతాలు జొహరాపురం, చిత్తారి వీధి, కొత్తపేట, రోజా వీధి ఏరియాల్లో 25 ఏళ్లుగా ఇసుక బండ్ల ద్వారా దళిత బడుగు బలహీనవర్గాలకు చెందిన కార్మికులు జీవనం సాగిస్తున్నారని అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదల ఉపాధికి గండి […]