సారథి న్యూస్, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ కు చెందిన చెరుకుపల్లి రామలింగయ్య కరోనాతో మృతిచెందారు. దహన నమస్కారాలు నిర్వహించేందుకు కుటుంబసభ్యులు ఎవరూ ముందుకురాలేదు. నేనున్నానని.. మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ పీపీఈ కిట్ ధరించి సోమవారం అతని అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా వైరస్ తో మరణిస్తే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం హేయమైనా చర్యగా అభివర్ణించారు. కరోనా ప్రబలిన నాటి నుంచి మృతుల అంత్యక్రియలు నిర్వహిస్తున్న తీరు మానవీయ విలువలను మంటగలిపేలా ఉందని ఆందోళన […]
సారథి న్యూస్, మహబూబ్ నగర్: చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు, ఆ వృత్తిదారులను ఆదుకునేందుకు ప్రజాప్రతినిధులు ప్రతి సోమవారం చేనేత వస్త్రాలను ధరించాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ సోమవారం చేనేత వస్త్రాలు ధరించారు. సాధారణంగా తెల్లటి వస్త్రధారణలో కనిపించే మంత్రి ఇలా కొత్త గెటప్‌లో కనిపించారు. తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులకు ఎంతో ప్రాధాన్యం ఇస్తూ ప్రోత్సహిస్తున్నామని మంత్రి తెలిపారు.
సారథి న్యూస్, మహబూబ్ నగర్: కరోనాను సమష్టగా ఎదుర్కొన్నామని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం జిల్లాలో రెండు కరోనా కేసులు మాత్రమే ఉన్నాయని, త్వరలోనే జీరో అవుతాయని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా రెడ్ జోన్ నుంచి ఆరెంజ్ జోన్ కు వచ్చిందని, త్వరలో గ్రీన్ జోన్ కు వస్తుందని, ఉపాధిలో 28వేల మందికి పనులు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రతిఒక్కరూ సామాజిక దూరం […]
సారథి న్యూస్, నారాయణపేట: ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కూలీలను వాటి యజమానులు ఆదుకోవాలని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సూచించారు. నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం, గొల్లపల్లిలో ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న ఒడిశా వలస కూలీలను మంగళవారం కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రజలతో పాటు వలసొచ్చిన కూలీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిత్యావసర వస్తువులు, నగదును ఇప్పటికే పంపిణీ చేశామన్నారు. మానవతా […]