సారథి న్యూస్, హైదరాబాద్: మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు ఈ దేశ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని నల్లగొండ ఎంపీ, పీసీసీ చీఫ్ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కొనియాడారు. పీవీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో తాను రాష్ట్రపతి భవన్ లో ప్రొటోకాల్ ఆఫీసర్ గా ఉన్నానని గుర్తుచేశారు. ఆ సమయంలోనే తనకు ఆయనతో అనేక విషయాలు చర్చించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. పీవీతో కలిసి విదేశీ పర్యటనలు చేసే అవకాశం వచ్చిందన్నారు. గాంధీభవన్ లో సోమవారం పీవీ నర్సింహారావు […]
సారథి న్యూస్, హైదరాబాద్ : రాజస్థాన్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. రాజస్థాన్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం సామాజిక మాధ్యమాల్లో తమ ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకప్ ఫర్ డెమోక్రసీ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి సహా పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని రక్షించండి, రాజ్యాంగాన్ని […]
సారథి న్యూస్, రంగారెడ్డి: టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు కళ్లెం సుజాత రెడ్డి ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికులను సన్మానించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీని ఊరూరా బలోపేతం చేస్తామని ఆమె ప్రకటించారు.
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ఈనెల 2న ప్రాజెక్టుల బాట పట్టాలని సోమవారం కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. కృష్ణానదిపై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. అక్కడే నిరసన దీక్షలు చేపట్టనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన కార్యక్రమాలను కొనసాగించనున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు దీక్షలను విజయవంతం చేయాలని నాయకులు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. […]