సారథి న్యూస్, రామడుగు: కరోనా విపత్తు వేళ గ్రామాల్లో వ్యవసాయ కూలీలకు డిమాండ్ ఏర్పడింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రస్తుతం రైతులు వరినాట్లు వేస్తున్నారు. కరోనా భయంతో కూలీలెవరూ వ్యవసాయ పనులకు రావడం లేదు. రూ. 450 ఇస్తామన్నా కూలీలు దొరకడం లేదు. దీంతో రైతులు ఇతర గ్రామాల నుంచి కూలీలను ఆటోలు, ట్రాక్టర్లను ఎక్కువ కూలీ ఇచ్చి తీసుకొస్తున్నారు. వరినాట్లు వేసేందుకు ఎకరానికి రూ.4వేల నుంచి రూ.5వేల గుత్తకు […]
సారథి న్యూస్, హుస్నాబాద్: అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గడిపె మల్లేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సోమవారం కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో ఆర్డీవో జయచంద్రారెడ్డికి వినతి పత్రం అందజేశారు. హుస్నాబాద్ మండలం గాంధీనగర్, తోటపల్లి ఊర చెరువుల నుంచి కొంతమంది రాత్రుళ్లు జేసీబీలతో తవ్వుతూ ట్రాక్టర్లతో మట్టి తరలిస్తు సొమ్ముచేసుకుంటున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వనేశ్, […]