టోక్యో: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. వచ్చే ఏడాది ఒలింపిక్స్ను నిర్వహించవద్దని సగానిపైగా టోక్యో ప్రజలు కోరుకుంటున్నారు. ఈ క్రీడల పండుగను పూర్తిగా రద్దుచేయాలని అభిప్రాయపడుతున్నారు. జపాన్‌కు చెందిన కైడో న్యూస్, టోక్యో ఎంఎక్స్ టెలివిజన్ అనే వార్త సంస్థలు నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం తేలింది. ఈనెల 26 నుంచి 28 వరకు టెలిఫోన్ ద్వారా జరిపిన సర్వేలో మొత్తం 1,030 మంది పాల్గొన్నారు. ఇందులో 51.7 శాతం మంది ప్రజలు క్రీడలను వాయిదా […]
టోక్యో: కరోనా విజృంభిస్తున్న తరుణంలో మాస్క్ లేనిది అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ వినూత్నంగా ఆలోచించి ‘స్మార్ట్ మాస్కు’ తయారుచేసింది. ఇంటర్నెట్కు, మనం వాడే స్మార్ట్ ఫోన్‌కు ఈ మాస్క్‌ను అనుసంధానం చేసుకోవచ్చు. ఈ మాస్కును బ్లూటూత్ ద్వారా మొబైల్ యాప్‌తో కనెక్ట్ చేసుకోవచ్చని డోనట్ రోబోటిక్స్ సీఈవో తైసుకే ఓనో తెలిపారు. ఈ సీ-మాస్క్ ద్వారా కాల్స్ చేయొచ్చని, మెసేజ్‌లను కూడా పంపించుకోవచ్చన్నారు. జపాన్ భాష […]
న్యూఢిల్లీ: జాతీయ ట్రయల్స్‌లో ఓడినా.. ఈసారి టోక్యో ఒలింపిక్స్‌కు కచ్చితంగా అర్హత సాధిస్తానని భారత రెజ్లర్ సాక్షి మాలిక్ తెలిపింది. గత ట్రయల్స్ నుంచి ఓటమి పాఠాన్ని నేర్చుకున్నానని పేర్కొంది. ఆసియా క్వాలిఫయర్స్ కోసం నిర్వహించిన 62 కేజీల ట్రయల్స్‌లో సోనమ్ మాలిక్ చేతిలో సాక్షి రెండుసార్లు ఓడింది. ‘తొలి బౌట్లో నేను గెలిచాను. కానీ చివరి సెకన్లలో పాయింట్లు కోల్పోవడంతో బౌట్ చేజారింది. రెండో బౌట్లో 2–1తో ముందంజలో ఉన్నా. కానీ ఆఖరి నిమిషంలో పిన్‌లో […]
టోక్యో: నాలుగేళ్లకు ఓసారి వచ్చే అతి పెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్ ప్రారంభోత్సవాన్ని ప్రపంచం మొత్తం గుర్తు పెట్టుకునేలా చాలా అట్టహాసంగా నిర్వహిస్తారు. తమ స్థాయి, పరపతి, ప్రతిష్టను ఇతర దేశాలకు చూపెట్టాలనే ఉద్దేశంతో నిర్వాహకులు కూడా భారీమొత్తంలో ఖర్చుచేస్తారు. కానీ టోక్యో ఒలింపిక్స్ ఇందుకు అతీతం కానుంది. కరోనా దెబ్బకు ఒలింపిక్స్ ఏడాది వాయిదా పడడంతో ఇప్పటికే ఖర్చు తడిసి మోపడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవాన్ని కూడా అట్టహాసంగా నిర్వహించాలంటే మరింత ఖర్చు చేయాల్సిన పని. […]
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ లుసానే: టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సాధించేందుకు చివరి తేదీ వచ్చే ఏడాది జూన్ 29. ఈ లోగా అన్ని అర్హత టోర్నీలను పూర్తి చేయాలని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) సూచించింది. వీలైనంత త్వరగా క్వాలిఫయింగ్ తేదీలను ప్రకటించాలని వెల్లడించింది. క్వాలిఫయింగ్ డ్రాఫ్ట్ ను రూపొందించడానికి సాయం చేయాలని సూచించింది. ‘అంతర్జాతీయ సమాఖ్యల క్యాలెండర్ లో టోర్నీల తేదీలు, వేదికలపై స్పష్టత లేదు. అందుకే వీలైనంత త్వరగా టోర్నీలు నిర్వహించాలి. తేదీలు, వేదికలను […]
–టోక్యో గేమ్స్ చీఫ్ మోరీ వ్యాఖ్య టోక్యో: వచ్చే ఏడాది వరకూ కరోనా వైరస్ కంట్రోల్ కాకపోతే టోక్యో ఒలింపిక్స్ పూర్తిగా రద్దవుతాయని గేమ్స్ ఆర్గనైజింగ్ కమిటీ ప్రెసిడెంట్ యోషిరో మోరీ వెల్లడించాడు. ఇప్పటికే ఏడాది వాయిదాపడిన గేమ్స్ను మరోసారి వాయిదా వేసే చాన్సే లేదని స్పష్టం చేశాడు. ‘అప్పుడెప్పుడో యుద్ధ సమయంలో ఒలింపిక్స్ను రద్దుచేశారు. కానీ ఇప్పుడు వరల్డ్ మొత్తం కనిపించని శత్రువుతో పోరాటం చేస్తోంది. ఇందులో మనం గెలవకపోతే అన్నీ ఇబ్బందులే. ఒకవేళ వైరస్‌ను […]