Breaking News

TELANGANA

కరోనా నివారణకు పకడ్బందీ చర్యలు

కరోనా నివారణకు పకడ్బందీ చర్యలు

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్​ సూచించారు. గురువారం ఆయన వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సయ్యద్‌ అలీ ముర్తుజాతో సమీక్షించారు. మార్చిన 2న రాష్ట్రంలో కరోనా కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు డాక్టర్లు, వైద్యసిబ్బంది విరామం లేకుండా పనిచేస్తున్నారని కొనియాడారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని ఐసోలేట్​ చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలో బస్తీ దవాఖానాల్లో మందులు, డాక్టర్లు అందుబాటులో ఉంచాలని మంత్రి ఈటల కోరారు.

Read More
కరోనా.. అదేతీరు

కరోనా.. అదేతీరు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో గురువారం 1,676 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్ ​కేసులు 41,018 నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు మృతుల సంఖ్య 396కు చేరింది. రాష్ట్రంలో 2,22,693 శాంపిళ్లను పరీక్షించారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. జీహెచ్ఎంసీ పరిధిలో 788, రంగారెడ్డి 224, మేడ్చల్​160, సంగారెడ్డి 57, వరంగల్​అర్బన్​ 47, కరీంనగర్​92, మహబూబాబాద్​19, మెదక్​26, నల్లగొండ 64, నాగర్​కర్నూల్​30, వనపర్తి 51, సూర్యాపేట, నిజామాబాద్​ […]

Read More
స్కూళ్ల ఓపెనింగ్ పై త్వరలోనే నిర్ణయం

స్కూళ్ల ఓపెనింగ్ పై త్వరలోనే నిర్ణయం

విద్యావేత్తలు, విషయ నిపుణుల అభిప్రాయాలు తీసుకుందాం విద్య పేరుతో జరుగుతున్న దోపిడీని అరికడదాం యూజీసీ, ఏఐసీటీఈ మార్గదర్శకాలు పాటించాలి ఆగస్టు 17నుంచి ఇంజనీరింగ్ విద్యాసంవత్సరం విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్​ సారథి న్యూస్, హైదరాబాద్: విద్యావ్యవస్థను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేసేందుకు దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి అమలుచేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. స్కూళ్లను ప్రారంభించే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. విద్యావేత్తలు, విషయ నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు […]

Read More
సెక్రటేరియట్​ కూల్చివేతపై విచారణ వాయిదా

సెక్రటేరియట్​ కూల్చివేతపై విచారణ వాయిదా

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ భవనాల కూల్చివేతపై విచారణను హైకోర్టు శుక్రవారం నాటికి వాయిదావేసింది. ఈ విషయమై దాఖలైన పిల్​పై గురువారం కోర్టు విచారణ చేపట్టింది. కేంద్ర పర్యావరణ అనుమతులు కూల్చివేత పనులకు అవసరమా? లేదో చెప్పాలని అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ ను హైకోర్టు కోరింది. ఎన్వీరాన్ మెంట్ రెగ్యులెటర్ యాక్ట్ క్లియరెన్స్ కు సంబంధించి పలు జడ్జిమెంట్​కాపీలను ఏజీ సమర్పించారు. భవనాల కూల్చివేతకు ఎన్వీరాన్ మెంట్ రెగ్యులెటర్ యాక్ట్ క్లియరెన్స్ అనుమతి అవసరం లేదని […]

Read More

తెలంగాణలో 1,597 కరోనా కేసులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో బుధవారం 1,597 కరోనా పాజిటివ్​కేసులు నమోదయ్యాయి. తాజాగా 11 మంది మహమ్మారి బారినపడి మృతిచెందారు. ఇలా రాష్ట్రంలో ఇప్పటివరకు 386 మంది మృత్యువాతపడ్డారు. మొత్తంగా పాజిటివ్​కేసుల సంఖ్య 39,342 కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 2,08,666 మందికి మెడికల్​టెస్టులు చేశారు. జిల్లాల వారీగా.. జీహెచ్ఎంసీ 796, మేడ్చల్​115, సంగారెడ్డి 73, కామారెడ్డి 33, వరంగల్​అర్బన్​44, పెద్దపల్లి 20, మెదక్​18, మహబూబ్ నగర్​21, మంచిర్యాల 26, నల్లగొండ 58, సూర్యాపేట జిల్లాలో 14 చొప్పున […]

Read More
రైతు వేదికలు, కల్లాలు పూర్తికావాలె

రైతు వేదికలు, కల్లాలు పూర్తికావాలె

సారథి న్యూస్​, వనపర్తి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పనులు, రైతు వేదికల నిర్మాణం, పల్లె, పట్టణ ప్రగతి పనులను విజయవంతంగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. జాబ్​కార్డులు ఉన్న కూలీలకు ఉపాధి పనులు కల్పించాలన్నారు. కొత్తవారికి జాబ్​కార్డులు మంజూరు చేయాలని కోరారు. బుధవారం ఆయన హైదరాబాద్​నుంచి వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడారు. రైతు వేదికల పనులను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లాకు కేటాయించిన నిధులతో వచ్చిన దరఖాస్తులను అనుసరించి […]

Read More
ఐటీ కంపెనీలను విస్తరించాలి

ఐటీ కంపెనీలను విస్తరించాలి

సారథి న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ గ్రోత్ ఇన్ డిస్కషన్(గ్రేడ్) లో భాగంగా ఐటీ కంపెనీల ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో మున్సిపల్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు బుధవారం సమావేశమయ్యారు. ఐటీ అనుబంధ కంపెనీలను హైదరాబాద్ నగరం నలుమూలలకు విస్తరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మెట్రోరైలు, శిల్పారామం, మూసీనది అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సామాజిక వసతులు పెరుగుతున్నాయని వివరించారు. ఇప్పటికే నగరం ఎలక్ట్రానిక్స్ ఏరో స్పేస్ మెడికల్ డివైస్ పార్క్ వంటి వివిధ రకాల […]

Read More
తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం

తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం

సారథి న్యూస్​, హైదరాబాద్: వేగంగా విజృంభిస్తున్న మహమ్మారిని అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఫ్రీగా కరోనా టెస్టులు, వైద్యం అందించాలని నిర్ణయించింది. అందుకోసం మొదట మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ఎంపికచేసింది. ఈ విషయమై సీఎం కేసీఆర్​ ఉన్నతాధికారులతో చర్చించినట్టు తెలిసింది. అయితే ఎంపికచేసిన వాటిలో మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, మమత మెడికల్ కాలేజీ, కామినేని మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మొదట కరోనా టెస్టులు, కరోనా వైద్యచికిత్సలు ఫ్రీగా అందజేస్తారు. […]

Read More