Breaking News

TELANGANA

తెలంగాణను అగ్రశ్రేణిగా నిలబెట్టాలి

తెలంగాణను అగ్రశ్రేణిగా నిలబెట్టాలి

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణను అగ్రశ్రేణి రాష్ట్రంగా నిలబెట్టాలని మున్సిపల్​, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు ఆకాంక్షించారు. సనత్ నగర్ లో సుమారు రూ.ఐదుకోట్ల వ్యయంతో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో రెండు బ్యాడ్మింటన్ ​కోర్టులు, లేడీస్ జిమ్, టేబుల్ టెన్నిస్, యోగా సెంటర్, క్యారమ్స్ ఆడేందుకు సదుపాయాలు కల్పించారు. అలాగే సనత్ నగర్ నెహ్రూ పార్కులో థిమ్ పార్కు నిర్మాణానికి మంత్రి కేటీఆర్ ​శంకుస్థాపన చేశారు. […]

Read More
రైతులకు రూ.51కోట్ల ధాన్యం చెల్లింపులు

రైతులకు రూ.51కోట్ల ధాన్యం చెల్లింపులు

సారథి న్యూస్, మెదక్: జిల్లాలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 16,971 మంది రైతుల నుంచి 51,746 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.51కోట్లను వారి ఖాతాలో జమచేశామని మెదక్​ జిల్లా కలెక్టర్ హనుమంతరావు చెప్పారు. కొనుగోలు కేంద్రాలకు వస్తున్న సన్నరకం ధాన్యాన్ని కూడా కొని మిల్లులకు తరలిస్తున్నామని, ఇందులో ఎలాంటి ఇబ్బందుల్లేవని, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు కూడా ఆదేశాలిచ్చామని కలెక్టర్ తెలిపారు. గురువారం తన ఛాంబర్ లో అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో […]

Read More
క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్ షురూ

క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్ ప్రారంభం

హైదరాబాద్: గ‌చ్చిబౌలిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూత‌నంగా ఏర్పాటుచేసిన క‌మాండ్ కంట్రోల్ అండ్ డేటా సెంట‌ర్‌ను రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, మ‌హ‌మూద్ అలీ, స‌బితా ఇంద్రారెడ్డి, డీజీపీ ఎం.మహేందర్ రెడ్డితో కలిసి బుధ‌వారం ప్రారంభించారు. ‘సేఫ్ అండ్ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌’లో భాగంగా ఈ డేటా సెంట‌ర్‌ను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది. కాగా, ఈ సెంట‌ర్‌లో భారీ తెర‌ను ఏర్పాటుచేశారు. దీని మీద ఒకేసారి ఐదువేల సీసీ కెమెరాల‌కు చెందిన లైవ్ దృశ్యాల‌ను వీక్షించొచ్చు. […]

Read More
ఓటమికి కుంగిపోం: మంత్రి కేటీఆర్​

ఓటమికి కుంగిపోం: మంత్రి కేటీఆర్​

సారథి న్యూస్, హైదరాబాద్: విజయాలకు పొంగిపోయేది లేదని, అపజయాలకు కుంగిపోవమని మంత్రి, టీఆర్ఎస్​ వర్కింగ్​ప్రెసిడెంట్​కె.తారక రామారావు అన్నారు. అప్పుడు.. ఇప్పుడు ఇదే చెబుతున్నామని అన్నారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్​లో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. దుబ్బాకలో టీఆర్ఎస్ కు ఓటువేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం పనిచేసిన ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావుతో పాటు మిగతా నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ‘తాము ఆశించిన ఫలితం రాలేదు.. ఈ ఎన్నిక మమ్మల్ని అప్రమత్తం చేసింది. […]

Read More
హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేయండి

హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేయండి

సారథి న్యూస్, జోగుళాంబ గద్వాల జిల్లా: రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ​ఇచ్చిన హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ డిమాండ్​ చేశారు. సోమవారం ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు అమరవాయి గ్రామంలో మాజీ ఎంపీపీ జయమ్మ ప్రకాష్ గౌడ్ ​నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుచేయలేదని మండిపడ్డారు. ఈరోజు తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్ ఎత్తుకుపోతుంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తుంగభద్ర నదికి […]

Read More
కేంద్రం నుంచి పైసా తీసుకొచ్చారా?

కేంద్రం నుంచి పైసా తీసుకొచ్చారా?

బీజేపీ ఎంపీలను ప్రశ్నించిన మంత్రి కె.తారకరామారావు సారథి న్యూస్, హైదరాబాద్: మానవ తప్పిదాలతో చెరువులు, నాలాలు కబ్జాకు గురికావడంతో ఇటీవల కురిసిన భారీవర్షాలకు విశ్వనగరం హైదరాబాద్​ నీట మునిగిందని మున్సిపల్ ​శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. తెలంగాణలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నా ఒక్క పైసా కూడా తీసుకురాలేదని విమర్శించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ​ముందుచూపుతో నష్టాన్ని నివారించగలిగామని అన్నారు. వరదల సమయంలో తక్షణ రక్షణ […]

Read More
పిలుస్తోంది.. న‌వోద‌య విద్యాల‌యం

పిలుస్తోంది.. న‌వోద‌య విద్యాల‌యం

హైద‌రాబాద్‌: దేశ‌వ్యాప్తంగా ఉన్న జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల్లో (జేఎన్‌వీ) వ‌చ్చే విద్యాసంవత్సరానికి 6వ త‌ర‌గ‌తిలో ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని జేఎన్‌వీఎస్ వెల్లడించింది. అధికారిక వెబ్‌సైట్ www.navodaya.gov.inలో డిసెంబ‌ర్ 15 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది. ప్రవేశ పరీక్షను 2021 ఏప్రిల్ 10న ఉద‌యం 11.30 గంట‌ల‌కు దేశంలోని అన్ని జ‌వ‌హ‌ర్ న‌వోద‌య విద్యాల‌యాల్లో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ప‌రీక్ష ఫ‌లితాల‌ను 2021 జూన్ నెల‌లో ప్రకటిస్తారు.ఎవ‌రెవరు అర్హులు?జ‌వ‌హ‌ర్ న‌వోద‌య […]

Read More
ధాన్యం కొనుగోళ్లకు రెడీ చేయండి

ధాన్యం కొనుగోళ్లకు రెడీ చేయండి

సారథి న్యూస్, మహబూబాబాద్: వానాకాలం పంట ధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని మహబూబాబాద్​ జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్​లో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో వరి ధాన్యం, మక్కలు, పత్తిని కొనుగోలు చేసేందుకు అంతా రెడీ చేయాలని సూచించారు. టార్పాలిన్​ కవర్లు, తేమశాతం మిషన్లు, వేయింగ్ మిషన్లను సిద్ధం చేసుకోవాలన్నారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్ ఎం.వెంకటేశ్వర్లు, డీఎస్​వో నర్సింగరావు, ఏపీడీ వెంకట్, డీఎంవో సురేఖ, […]

Read More