ప్రధాని నరేంద్రమోడీ సెటైర్ యూపీలో స్పోర్ట్స్యూనివర్సిటీకి శంకుస్థాపన మీరట్: ఒకప్పటి నేరస్తుల గడ్డ త్వరలో క్రీడాకారులకు అడ్డాగా మారబోతుందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. గతంలో నేరస్తులు మీరట్ పరిసర ప్రాంతాల్లో ‘ఖేల్ ఖేల్’ అంటూ సామాన్యుల జీవితాలతో చెలగాటం ఆడుకునేవాళ్లని, యోగి ఆదిత్యానాథ్ప్రభుత్వం వచ్చాక ఆ నేరస్తులంతా ఇప్పుడు ‘జైల్ జైల్’ అంటూ ఊసలు లెక్కబెడుతున్నారని సెటైర్లు వేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సర్ధనలో ప్రధాని నరేంద్రమోడీ స్పోర్ట్స్ యూనివర్శిటీకి ఆదివారం శంకుస్థాపన చేశారు. రూ.700 కోట్లతో దాదాపు 92 […]
దుబాయ్: మరికొద్ది రోజుల్లో మొదలవనున్న ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ జట్టు సభ్యుడు, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం ఈ ఏడాది ఐపీఎల్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే సీఎస్కే కీలక సభ్యుడు సురేష్ రైనా టోర్నీ నుంచి బయటకు రాగా.. ఇప్పుడు భజ్జీ కూడా నిష్క్రమించాడు. వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ నుంచి తప్పుకుంటున్నట్టు సీఎస్కే యాజమాన్యానికి టర్భోనేటర్ వివరించాడు.
న్యూఢిల్లీ: జాతీయ క్రీడా పురస్కారాల తుది గడువును ఈనెల 22 వరకు కేంద్ర క్రీడాశాఖ పొడిగించింది. క్రీడా అధికారులు, సమాఖ్యలు, అసోసియేషన్ల ప్రతిపాదన లేకుండా.. అథ్లెట్లు ‘సెల్ఫ్ నామినేషన్’ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. దేశ వ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో చాలా మంది అధికారులు, సమాఖ్యలు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త ఆదేశాల ప్రకారం అవార్డుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి ఎవరి ప్రతిపాదన అవసరం లేదు. అథ్లెట్ తనకు సంబంధించిన విషయాలతో కూడిన సొంత […]
సారథి న్యూస్, మహబూబ్ నగర్ : ఈనెల 27 నుండి 30 వరకు తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం, ఈఎల్ఎంఎస్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాయామ విద్య ఆన్లైన్ క్లాసెస్ ను జిల్లాలోని పీఈటీలు, పీడీలు వినియోగించుకోవాలని సంఘం మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు దూమర నిరంజన్, ప్రధాన కార్యదర్శి కృష్ణయ్య బుధవారం కోరారు. మొదటి రోజు సెషన్ లో భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్, భారత అథ్లెటిక్స్ కోచ్ నాగపురి […]