సారథి న్యూస్, కర్నూలు: అపరిచిత వ్యక్తుల ఫోన్‌కాల్స్, సైబర్ నేరగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ కె.ఫక్కీరప్ప సూచించారు. డేటింగ్ వెబ్ సైట్స్ లో రిజిస్ట్రేషన్ కోసం ఇచ్చిన మొబైల్ నంబర్స్‌ను వాట్సప్‌ద్వారా పరిచయం చేసుకుంటారని, మిమ్మల్ని మాయమాటలతో గారడీ చేసి ఫోర్న్సైట్ల నుంచి తీసుకున్న వీడియోలతో బ్లాక్మెయిల్చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. తరువాత డబ్బుల కోసం బెదిరించడం మొదలుపెడతారని సూచించారు. ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక పోలీసు స్టేషన్ లో గాని, సైబర్ ల్యాబ్ పోలీసులకు […]
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరంలో ఆదివారం జరిగిన గణేశ్ నిమజ్జన వేడుకల్లో కర్నూలు ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప పాల్గొన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసు బందోబస్తును పర్యవేక్షించారు. నిమజ్జనం ప్రశాంతంగా, శాంతియుత వాతవరణంలో జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ వివరించారు. కోవిడ్19 నిబంధనల మేరకు నిమజ్జనోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ బాలాజీ, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, మాజీ ఎమ్మెల్యే ఎస్ వీ మోహన్ […]
సారథి న్యూస్, కర్నూలు: పోలీసుశాఖలోని (సీఐడీ) కర్నూలు ప్రాంతీయ ఫింగర్ ప్రింట్ బ్యూరో సీఐగా పనిచేస్తున్న శివారెడ్డికి డీఎస్పీగా పదోన్నతి లభించింది. ఈ మేరకు శుక్రవారం డీఎస్పీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ డాక్టర్ఫక్కీరప్పను జిల్లా పోలీసు ఆఫీసులో కలిసి బొకే అందజేశారు.
సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు నగరానికి సమీపంలోని గోనెగండ్ల మండలం గాజులదిన్నె ప్రాజెక్టును జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప సోమవారం ఆకస్మికంగా సందర్శించి వరద ఉధృతిని పరిశీలించారు. ముందస్తు జాగ్రత్త చర్యలపై ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. వాగులు, వంకలను దాటేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారన్నారు. ఆరువేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు చేరిందన్నారు. హంద్రీనీవా నదిలో […]
సారథి న్యూస్, కర్నూలు: అనంతపురం జిల్లాకు చెందిన 8 మంది ఏఎస్సైలు ఎస్సైలుగా పదోన్నతి పొందిన సందర్భంగా వారిని విధుల కోసం కర్నూలు జిల్లాకు కేటాయించారు. గురువారం వారు జిల్లా ఎస్పీ ఆఫీసులో ఎస్పీ డాక్టర్ కాగినెల్లి ఫక్కీరప్పను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు. మరిన్ని పదోన్నతులు పొందాలని ఎస్పీ ఆకాంక్షించారు. కరోనా సమయంలో ప్రజలకు మంచి సేవలు అందించి పోలీసుశాఖకు పేరు తీసుకురావాలని కోరారు.