Breaking News

నేరెళ్ల బాధితులకు ఆర్​ఎస్పీ భరోసా

నేరెళ్ల బాధితులకు ఆర్ఎస్పీ భరోసా

సామాజికసారథి, రాజన్నసిరిసిల్ల: నేరెళ్ల ఘటన జరిగి ఐదేళ్లు దాటినా దళితులకు న్యాయం జరగలేదని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) రాష్ట్ర చీఫ్​కోఆర్డినేటర్​డాక్టర్​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. నేరెళ్ల బాధితుడు కోల హరీశ్ నివాసంలో నేరెళ్ల గ్రామస్తులతో ఆదివారం ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇసుక మాఫియా ద్వారా సీఎం కేసీఆర్‌ కుటుంబం రూ.వేలకోట్లు దోచుకుంటోందని ధ్వజమెత్తారు. నేరెళ్ల బాధితులకు థర్డ్ డిగ్రీ చేసిన పోలీసులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బాధితులపై తప్పుడు కేసులు పెట్టారని పోలీసుల వైఖరిపై మండిపడ్డారు. నేరెళ్ల బాధితుల కుటుంబాలకు జరిగేంత వరకు బీఎస్పీ అండగా ఉంటుందని బాధితులకు భరోసా ఇచ్చారు.