సారథిన్యూస్, నాగర్ కర్నూల్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ పంచాయతీ కార్యదర్శిని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ శర్మన్ సస్పెండ్ చేశారు. బిజినేపల్లి మండలం ఖానాపూర్ గ్రామపంచాయతీలో సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న రాజశేఖర్ కొంతకాలంగా విధులకు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో విచారణ చేపట్టిన కలెక్టర్ రాజశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: కొల్లాపూర్ మరింత అభివృద్ధి చెందాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్ ఆకాంక్షించారు. ఆదివారం ఆయన మార్నింగ్ వాక్‌లో భాగంగా కొల్లాపూర్ లో పర్యటించారు. పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ఆ మేరకు ప్రణాళికలతో అధికారులు ముందుకు సాగాలని సూచించారు. మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పట్టణాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని సూచించారు. కరెంట్ బిల్లులు నెలనెలా చెల్లించాలని, విద్యుత్‌ను పొదుపుగా వాడాలని సూచించారు. పట్టణంలో డంపింగ్ యార్డ్ పనులను కంప్లీట్ చేయాలన్నారు. […]
సారథిన్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రాన్ని అందరి భాగస్వామ్యంతో సర్వాంగ సుందరంగా మార్చుదామని కలెక్టర్ ఎల్ శర్మన్ పిలుపునిచ్చారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన శర్మన్ శనివారం ఉదయం 5:40కి పట్టణంలో మార్నింగ్వాక్చేసి సమస్యలను తెలుసుకున్నారు. మున్సిపల్ కార్మికులతో మాట్లాడారు. వ్యాపారులు రోడ్లవెంబడి చెత్తవేస్తే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బస్టాండ్‌లోని మూత్రశాలలో అపరిశుభ్ర వాతావరణం ఉండటంతో అక్కడి నిర్వాహకులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కార్యాలయానికి రావాలని డిపో మేనేజర్‌ను ఆదేశించారు. 10 రోజుల్లోనే నాగర్‌కర్నూల్ […]
సారథి న్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎల్.శర్మన్ ను కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. బొకే అందజేసి విషెస్చెప్పారు. జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యేను కలెక్టర్ కోరారు.
సారథి న్యూస్, నాగర్ కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్‌గా ఎల్.శర్మన్ శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించారు. ఓ గర్భిణికి అవసరమైన ‘ఓ’ నెగిటివ్ బ్లడ్‌ను స్వయంగా డొనేట్ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ శర్మన్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధికి కృషిచేస్తానని చెప్పారు. కరోనా మహమ్మారి పట్ల ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.