సారథి న్యూస్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్(జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చివరిరోజు హోరాహోరీగా ప్రచారం సాగింది. ప్రధాన రాజకీయ పార్టీల నేతలంతా సుడిగాలి పర్యటన చేశారు. అందులో భాగంగానే రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జుమ్మేరాత్ బజార్, సనత్ నగర్ నియోజకవర్గం పరిధిలోని పాటిగడ్డ చౌరస్తా, అలాగే సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలోని శాంతినగర్ చౌరస్తాలో నిర్వహించిన రోడ్ షోలో ప్రసంగించారు. టీఆర్ఎస్ప్రభుత్వం ఈ ఆరేళ్లలో […]
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణను అగ్రశ్రేణి రాష్ట్రంగా నిలబెట్టాలని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు ఆకాంక్షించారు. సనత్ నగర్ లో సుమారు రూ.ఐదుకోట్ల వ్యయంతో నిర్మించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో రెండు బ్యాడ్మింటన్ కోర్టులు, లేడీస్ జిమ్, టేబుల్ టెన్నిస్, యోగా సెంటర్, క్యారమ్స్ ఆడేందుకు సదుపాయాలు కల్పించారు. అలాగే సనత్ నగర్ నెహ్రూ పార్కులో థిమ్ పార్కు నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. […]