సారథి, ములుగు: ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన వేడుకగా పేరొందిన మేడారం మహా జాతర తేదీలు ఖరారు అయ్యాయి. 2022 ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను నిర్వహించనున్నారు. తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో వెలిసిన ఆదివాసీ గిరిజన దైవం మేడారం సమ్మక్క, సారలమ్మల మహా జాతరను ఆదివాసీ గిరిజన సంప్రదాయ ప్రకారం మాఘశుద్ధ పౌర్ణమి రోజున అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వచ్చే సంవత్సరం నిర్వహించే జాతర తేదీలను పూజారులు […]
సారథిన్యూస్, ములుగు: సమ్మక్క, సారలమ్మ దర్శనం కోసం వచ్చిన ఓ వ్యక్తి జంపన్నవాగులో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ సమీపంలోని ఘట్కేసర్ పరిధిలోని శివారెడ్డి గూడకు చెందని సుదర్శన్‌రెడ్డి (50) స్నేహితులతో కలిసి అమ్మవార్లను దర్శించుకొనేందుకు ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారానికి వచ్చారు. దైవదర్శనానికి ముందు జంపన్నవాగులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు మునిగిపోయిన ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.