సారథి న్యూస్, వరంగల్: వరంగల్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వరంగల్ రూరల్ జిల్లా దామెర మండలం పసరగొండ వద్ద లారీ.. కారును ఓవర్టేక్ చేయబోయి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా కారులో ఉన్న మేకల రాకేశ్, మేడి చందు, రోహిత్, సాబిర్, పవన్ మృతిచెందారు. మృతులంతా పోచం మైదాన్‌కు చెందినవారని సమాచారం. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
‘సారథి’ కథనానికి విశేష స్పందన సాయం చేసేందుకు ముందుకొచ్చిన దాతలు సారథి న్యూస్, రామడుగు: మూడు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి జీవచ్ఛంలా మారి.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న కరీంనగర్ జిల్లా రామడుగు గ్రామానికి చెందిన చెందిన అంజలి భర్త రాజేశేఖర్‌కు సాయం చేసేందుకు పలువురు ముందుకొచ్చారు. ‘ఆపదలో ఉన్నం ఆదుకోండి’ శీర్షికన గత సోమవారం ‘సారథిమీడియా’లో వచ్చిన వార్తా కథనానికి పలువురు ముందుకొచ్చారు. సింగపూర్ లో ఉన్న రామడుగు వాసులు తోట శ్రీనివాస్, […]
సారథిన్యూస్, రామడుగు: రోడ్డు ప్రమాదం అతడి జీవితాన్ని అతలాకుతలం చేసింది. తనను నమ్ముకున్న భార్యా, బిడ్డలను రోడ్డున పడేసింది. పనిచేసుకుంటే గానీ పూటగడవని ఆ కుటుంబానికి ఇప్పడు పెద్దకష్టమే వచ్చి పడింది. దాతలు ముందుకొచ్చి తమను ఆదుకోవాలని ప్రస్తుతం ఆ కుటుంబం దీనంగా వేడకుంటున్నది. కరీంనగర్ జిల్లా రామడుగుకు చెందిన రాజశేఖర్ మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటినుంచి అతడు మంచానికే పరిమితమయ్యాడు. అతడికి మెదడులో రక్తం గడ్డకట్టిందని.. ఆపరేషన్ చేసేందుకు రూ. […]