Breaking News

REVENUE ACT

రైతులకు వరం నూతన రెవెన్యూ చట్టం

రైతులకు వరం నూతన రెవెన్యూ చట్టం

సారథి న్యూస్, రామగుండం: తెలంగాణ రాష్ట్రంలోని భూవివాదాలకు చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ గారు ఎంతో పారదర్శకంగా నూతన రెవెన్యూ చట్టాన్ని అమలు చేశారని, తెలంగాణ రాష్ట్రంలో రైతు రాజ్యమే సాగుతుందని పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఆదివారం రామగుండం బీ పవర్ హౌస్​ వద్ద ట్రాక్టర్లను వారు ప్రారంభించి మాట్లాడారు. తెలంగాణ రైతుల భూముల కష్టాలను పూర్తిస్థాయిలో రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చారిత్మక నిర్ణయం తీసుకుందని చెప్పారు. […]

Read More

చివరి గుడిసె దాకా ఫలితాలు అందాలి

సారథి న్యూస్​, హైదరాబాద్​: ఏ ఒక్క నిరుపేదకూ బాధ కలుగకుండా, చివరి గుడిసె దాకా వాటి ఫలితాలు అందేలా చూడటమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దశాబ్దాల కాలంగా వలస పాలనలో అపరిష్కృతంగా ఉన్న నివాసస్థలాలు, సంబంధిత భూ సమస్యల పరిష్కారానికి మున్సిపాలిటీల పరిధిలోని ప్రజాప్రతినిధులు, మేయర్లతో సీఎం కేసీఆర్ గురువారం ప్రగతి భవన్ లో సమావేశం నిర్వహించారు. మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటికీ ఆన్ లైన్ లో నమోదుకాని ప్రజల ఇళ్లు, […]

Read More
వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ కలర్ పట్టా బుక్కులు

వ్యవసాయేతర ఆస్తులకు మెరూన్ కలర్ పట్టా బుక్కులు

ఇక ముందు ఇంచు భూమి బదిలీ కావాలన్నా ధరణి పోర్టల్​లోనే.. సాదాబైనామాలకు ఇదే చివరి అవకాశం ఫ్రీగా నోటరీ, జీవో 58, 59 స్థలాల రెగ్యులరైజేషన్​ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్​, హైదరాబాద్​: దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయేతర ఆస్తులు కలిగి ఉన్న ప్రజలందరికీ మెరూన్ కలర్ పట్టాదారు పాస్ బుక్కులు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కొత్త రెవెన్యూ చట్టం ద్వారా పేద, మధ్యతరగతి సహా ప్రజలందరి ఆస్తులకు […]

Read More
పోస్టులోనే రైతుల ఇంటికి పట్టా బుక్కులు

పోస్టులోనే రైతుల ఇంటికి పట్టా బుక్కులు

సారథి న్యూస్, మెదక్: రైతును రాజుగా చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చిందని మంత్రి హరీశ్ రావు స్పష్టంచేశారు. ఈ చట్టం ప్రకారం తహసీల్దార్ ​ఆఫీసుల్లోనే అన్ని పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. అలాగే భూమిని కొన్నా, అమ్మినా తహసీల్దార్​ల సమక్షంలోనే చేస్తారని, వాటికి సంబంధించిన పట్టాదారు పాస్​పుస్తకాలు, రిజిస్ట్రేషన్ ​పేపర్లు పోస్టులోనే రైతుల ఇంటికి వస్తాయని తెలిపారు. దీనికోసం రైతులు గతంలో మాదిరిగా ఆఫీసుల చుట్టూ తిరిగాల్సిన పనిలేదన్నారు. బుధవారం మెదక్ […]

Read More
పకడ్బందీగా నూతన రెవెన్యూ చట్టం అమలు

పకడ్బందీగా నూతన రెవెన్యూ చట్టం అమలు

ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నదే లక్ష్యం రెవెన్యూశాఖలో ప్రమోషన్లు ప్రక్రియను పూర్తిచేయాలి ట్రెసా ప్రతినిధుల సమావేశంలో సీఎం కె.చంద్రశేఖర్​రావు సారథి న్యూస్​, హైదరాబాద్: ప్రజల కేంద్ర బిందువుగానే ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటుందని, ఆ నేపథ్యంలోనే నూతన రెవెన్యూ చట్టం తీసుకొచ్చామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టంచేశారు. ఈ చట్టం ఎవరికి వ్యతిరేకం కాదన్నారు. తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో తీసుకొచ్చిన నూతన రెవెన్యూ చట్టాన్ని పకడ్బందీగా అమలుచేద్దామని పిలుపునిచ్చారు. శనివారం ప్రగతిభవన్​లో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ […]

Read More
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

సారథి న్యూస్, ఖిల్లా వరంగల్: కొత్త రెవెన్యూ చట్టం అసెంబ్లీలో ఆమోదం పొందిన నేపథ్యంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆదేశాల మేరకు ఖిల్లా వరంగల్ చమన్ సెంటర్​లో శుక్రవారం సీఎం కేసీఆర్​ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ​నాయకుడు దామోదర్ యాదవ్ మాట్లాడుతూ.. బూజుపట్టిన రెవెన్యూ వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి సీఎం కేసీఆర్​అహర్నిశలు కృషిచేస్తున్నారని కొనియాడారు. రెవెన్యూ నూతన చట్టం ద్వారా రైతులు, ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయని అన్నారు. కార్యక్రమంలో […]

Read More
వీఆర్వోలకు ఏమీ కాదు: సీఎం కేసీఆర్​

వీఆర్వోలకు ఏమీ కాదు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్​రావు వీఏవోలు, వీఆర్వోలకు తీపిక‌బురు అందించారు. ప్రజలకు మేలు చేసేందుకు మాత్రమే కొత్త రెవెన్యూ చ‌ట్టం బిల్లును తీసుకొస్తున్నామని అన్నారు. బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. వీఏవోల‌ను స్కేలు ఉద్యోగులుగా గుర్తిస్తామ‌న్నారు. వారి అర్హతలను బట్టి ఇరిగేష‌న్‌, పంచాయ‌తీరాజ్‌, మున్సిప‌ల్ శాఖ‌ల్లో వీఆర్వోలను భ‌ర్తీ చేస్తామ‌న్నారు. రెవెన్యూ సంస్కరణ వ‌ల్ల ఉద్యోగుల‌కు ఎలాంటి స‌మ‌స్య ఉండ‌ద‌ని సీఎం స్పష్టంచేశారు. సంస్కరణల వల్ల ప్రజలకు కొన్ని ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. రెవెన్యూ సమస్యల […]

Read More
వీఆర్వోల నుంచి భూరికార్డుల స్వాధీనం

వీఆర్వోల నుంచి భూరికార్డుల స్వాధీనం

సారథి న్యూస్, రామడుగు, రామాయంపేట, కౌడిపల్లి: రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి వీఆర్వో వ్యవస్థను రద్దుచేయనున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం వీఆర్​వోల నుంచి పలు భూసంబంధిత రికార్డులను రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు స్వాధీనం చేసుకున్నారు. అందులో భాగంగానే కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలో రికార్డులను తీసుకున్నారు. అలాగే మెదక్​ జిల్లా.. మెదక్ ఆర్డీవో సాయిరాం నిజాంపేట మండలంలోని పలు గ్రామాల వీఆర్వోల వద్ద నుంచి భూరికార్డులను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ జయరాం, గిర్దవర్ […]

Read More