సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ బుధవారం పలువురు లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ దేనని కొనియాడారు. పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డులను విడతల వారీగా ఇస్తామని, రానున్న రోజుల్లో అర్హులైన వారికి పింఛన్లు కూడా మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సుంకే […]
సారథి, కోడేరు. అర్హులైన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన కొత్త రేషన్ కార్డులను నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలకు రూ.10 లక్షలు మంజూరు చేయించినట్లు తెలిపారు. కోడేరు మండలానికి అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. మండల కేంద్రంలో డబుల్ రోడ్డు నిర్మాణ పనులు కూడా ముమ్మరంగా సాగుతున్నాయని వివరించారు. కరోనా కారణంగా సంవత్సరన్నర కాలంగా […]
ఆగస్టు నుంచి బియ్యం పంపిణీ సీఎం కేసీఆర్ వెల్లడి సారథి, హైదరాబాద్: ఈనెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులను రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను ఆదేశించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకుని అర్హులైన 3,60,000 పై చిలుకు లబ్ధిదారులకు ఆయా నియోజకవర్గాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలోనే విధిగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు. జులై 26 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ ప్రక్రియను నిర్వహించాలని […]
పెండింగ్ అప్లికేషన్లను పరిశీలించండి అద్దె ఇళ్లల్లో ఉన్నవారికీ కార్డులు ఖాళీగా ఉన్న రేషన్ డీలర్ పోస్టుల భర్తీ తండాలు పంచాయతీగా మారిన చోట సబ్ డీలర్ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సారథి ప్రతినిధి, జగిత్యాల: రాష్ట్రంలో అర్హులైన అందరికీ పారదర్శకంగా కొత్త రేషన్ కార్డులను జారీచేయాలని బీసీ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ సూచించిన విధంగా పెండింగ్ లో ఉన్న అప్లికేషన్లను రెవెన్యూ, […]
సారథి, హైదరాబాద్: అర్హులందరికీ గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం ద్వారా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని సోమవారం ఉప్పల్ డిప్యూటీ తహసీల్దార్ రఫీఉద్దీన్, అసిస్టెంట్ సివిల్ సప్లై ఆఫీసర్ సరస్వతికి కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ పవన్‌కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ కోశాధికారి చింతల సురేందర్ యాదవ్, రంగారెడ్డి జిల్లా అర్బన్ బీజేపీ కార్యదర్శి పద్మారెడ్డి, రంగారెడ్డి జిల్లా అర్బన్ అధికార ప్రతినిధి కంది కంటి కన్నాగౌడ్, రంగారెడ్డి […]