సారథి, రామడుగు: మానవత్వం ఇంకా బతికే ఉందన్నదానికి ఈ సాయమే నిదర్శనం. కరోనా బాధితురాలిని అద్దె ఇంట్లో నుంచి గెంటివేస్తే వారికి ఆశ్రయం కల్పించి మానవత్వం చాటుకున్నారు ఓ మంచి మనిషి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల్ రావుపేటలో కరోనా బారినపడిన కుటుంబానికి అద్దెకు ఇచ్చిన యజమాని తమ ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. వెంటనే ఆ కుటుంబానికి సర్పంచ్ సత్యప్రసన్న చేయూత ఇచ్చారు. రెండ్ల మల్లేశం ఆ కుటుంబ పరిస్థితిని వారికి తీసుకుపోవడంతో నిర్మాణదశలో ఉన్న […]
సారథి, రామడుగు: కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీని ప్రభావం పండగలపై పడింది. అందులో భాగంగానే శుక్రవారం రంజాన్ నిరాడంబరంగా ఇంట్లోనే జరుపుకున్నారు. ఉదయాన్నే ఇంట్లోనే నమాజ్ చేసి సెమియా, బిర్యానీ వంటి వంటకాలు తయారుచేసి భుజించారు.
సారథి, రామడుగు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి పట్ల రామడుగు మండలం గోపాల్ రావుపేట సర్పంచ్ కర్ర సత్యప్రసన్న ఉదారత చాటుకున్నారు. లాక్ డౌన్ తో అంబులెన్స్ లు, ఇతర వాహనాలు దొరక్క హాస్పిటల్ కు వెళ్లలేని వారి కోసం స్వయంగా తన సొంత కారును గురువారం నుంచి అందుబాటులో ఉంచారు. పెట్రోల్, డ్రైవర్ ను సంబంధిత వ్యక్తులే చూసుకోవాలని సర్పంచ్ సత్యప్రసన్న సూచించారు. […]
సారథి, రామడుగు: ఓ మనసున్న మారాజు ఉండేది విదేశాల్లోనైనా తన స్వగ్రామంలోని నిరుపేదలకు తనవంతు సాయమందిస్తూ పేద కుటుంబాల్లో దేవుడయ్యాడు. అది ఎక్కడో చూద్దాం పదండి. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన తోట సత్యం తన కుటంబంతో సహ అమెరికాలో స్థిరపడ్డాడు. సత్యంకు తన ఊరంటే ఏనలేని ప్రేమతో పేదింటి విద్యార్థుల చదువు, పెళ్ళిలు, వృద్ధులకు పెన్షన్లు, తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అనేక సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తూ గ్రామంలో తనకంటూ ఓ సముచిత స్థానం […]
వ్యవసాయం తెలియని శ్రీమంతుడు ఎకరాకు 90 బస్తాలు వరి ధాన్యం దిగుబడి సారథి, రామడుగు: ఆయనకు వ్యవసాయమంటే పెద్దగా తెలియదు. సాగు పద్ధతులు అంతకన్నా రావు. కనీసం సాగులో అనుభవం తనకు అనుభవం లేకున్నా తలపండిన రైతులను సైతం అధిగమించి పంట అధిక దిగుబడి సాధించాడు. దీంతో అందరిచేత శ్రీమంతుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రానికి చెందిన పంజాల భానుచందర్ గౌడ్ అనే యువరైతు నూతనంగా వ్యవసాయం ప్రారంభించారు. తనకు ఉన్న వ్యవసాయ […]
సారథి, రామడుగు: కరోనా సెకండ్ వేవ్ ఉధృతమవుతున్న నేపథ్యంలో అధిక మంది టెస్టులు చేసుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. కరీంనగర్జిల్లా రామడుగు ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన టెస్టింగ్ సెంటర్ లో కరోనా పరీక్షల కోసం జనం బారులుదీరారు. కానీ టెస్టింగ్ కిట్లు లేకపోవడంతో చాలా మంది నిరాశతో వెనుదిరిగారు.
సారథి, రామడుగు: కార్మిక వ్యతిరేక చట్టాల రద్దుకోసం కార్మిక లోకం ఉద్యమించాలని కరీంనగర్సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. శనివారం మే డే సందర్భంగా రామడుగు మండలంలోని దేశరాజుపల్లి, రామడుగు, గుండి, లక్ష్మిపూర్, గోపాలరావుపేట తదితర గ్రామాల్లో ఎర్రజెండా ఎగరవేసి కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు ఈ దేశాన్ని తాకట్టు పెడుతూ రైతులను వారి భూముల్లోనే పాలేర్లుగా మార్చుతుందన్నారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం రజాకార్ల […]
రైతులకు తప్పని తిప్పలు కరెంట్ వసతి కల్పించాలని డిమాండ్ సారథి, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్యాడి క్లీనర్ల లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సొంతంగా ఎడ్ల బండ్లకు పంకలు కట్టి వడ్లు పడుతున్నారు. ట్రాక్టర్ పంకకు గంటకు రూ.వెయ్యి చొప్పున అద్దెకు తెచ్చుకుంటున్నారు. కనీసం ఉన్న రెండు ప్యాడి క్లీనర్లకు కరెంట్సౌలత్ లేక అష్టకష్టాలు పడుతున్నారు. ధాన్యాన్ని ఆరబోసేందుకు కల్లాలు లేకపోవడంతో పొలాలు, ఇళ్ల మధ్యలో […]