Breaking News

RAMADUGU

గోవధకు పాల్పడొద్దు

గోవధకు పాల్పడొద్దు

సారథి, రామడుగు: కరీంనగర్ ​జిల్లా రామడుగు మండలంలోని అన్ని గ్రామాల మసీద్ కమిటీ సభ్యులతో ఎస్సై టి.వివేక్ శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. బక్రీద్ సందర్భంగా ఎలాంటి గోవధకు పాల్పడొద్దని సూచించారు. అందరూ కలిసి స్నేహపూర్వకంగా బక్రీద్ ను జరుపుకోవాలని ఆకాంక్షించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించవద్దని ఎస్సై టి.వివేక్​ కోరారు.

Read More
‘భగీరథా’.. ఏమిటీ వృథా!

‘భగీరథా’.. ఏమిటీ వృథా!

సారథి, రామడుగు: సురక్షితమైన నీటిని అందించి ప్రజల దాహార్తి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు అక్కడక్కడ అభాసుపాలవుతున్నాయి. కరీంనగర్ ​జిల్లా రామడుగు మండలం వెదిర అనుబంధ గ్రామమైన రాజాజీనగర్ లో భగీరథ పైపులు పగిలి కొద్దిరోజులుగా విలువైన తాగునీరంతా ప్రధాన రహదారిపై వృథాగా పారుతోంది. ఈ విషయమై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులకు చెబితే కాంట్రాక్టర్ పై నెపం నెట్టుతూ పబ్బం గడుపుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. నీరంతా ఇలా పారుతుండటంతో రాజాజీనగర్ […]

Read More
ప్రభుత్వ భూములను వేలం వేయొద్దు

ప్రభుత్వ భూములను వేలం వేయొద్దు

సారథి, రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ భూముల అమ్మకానికి తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 15న జరిగే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ కరీంనగర్​ జిల్లా సహాయ కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం రామడుగు మండల కేంద్రంలో సీపీఐ ముఖ్యకార్యకర్తల సమావేశం గొడిశాల తిరుపతిగౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల వేలం కోసం తెచ్చిన జీవోనం.13ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇండ్ల […]

Read More
నాయీబ్రాహ్మణ సంఘం నూతన కమిటీ ఎన్నిక

నాయీబ్రాహ్మణ సంఘం నూతన కమిటీ ఎన్నిక

సారథి, రామడుగు: వెంకటేశ్వర నాయీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం రామడుగు గ్రామశాఖ నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు. రామడుగు మండలాధ్యక్షుడిగా సముద్రాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా సముద్రాల రవీందర్, ప్రధాన కార్యదర్శిగా సముద్రాల నారాయణ, కోశాధికారి సముద్రాల సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులుగా రవీందర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కార్యవర్గసభ్యులు మాట్లాడుతూ బాధ్యతగా వ్యవహరిస్తూ సంఘ అభ్యున్నతికి పాటుపడుతామని తెలిపారు. తమ ఎన్నికకు సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

Read More
నిధులు కేటాయించాలని ఎంపీటీసీల నిరసన

పల్లెప్రగతిలో నిధులు కేటాయించండి

సారథి, రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో తమకు నిధులు కేటాయించాలని డిమాండ్​ చేస్తూ కరీంనగర్​ జిల్లా రామడుగు మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఎంపీటీసీల ఫోరం ఆధ్వర్యంలో గురువారం ఎంపీటీసీ సభ్యులు నిరసన చేపట్టారు. గెలిచి రెండేళ్లు గడిచినా కేవలం ఉత్సవ విగ్రహాలుగా మిగిలిపోయారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ ల మాదిరిగానే ఎంపీటీసీలు కూడా ప్రత్యేక్షంగా ప్రజల చేత ఎన్నుకున్నారని గుర్తుచేశారు. వారికి ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడంతో […]

Read More
పల్లెప్రగతి షురూ

పల్లెప్రగతి షురూ

సారథి, రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగో విడత పల్లెప్రగతి కార్యక్రమం కరీంనగర్ ​జిల్లా రామడుగు మండల వ్యాప్తంగా గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆయా గ్రామాల్లో నాయకులు, ప్రత్యేకాధికారులు పాల్గొని మొక్కలు నాటి పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. కొరటపల్లి గ్రామంలో ప్రత్యేకాధికారి మౌనిక ఆధ్వర్యంలో ఎంపీపీ కల్గెటి కవిత ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నిర్దేశించిన ప్రకారం మొక్కలు నాటాలని, పాడుబడిన ఇండ్లను పూడ్చివేయాలని, శానిటేషన్ పనులు చేపట్టాలని సూచించారు. ప్రతిఇంటిలో ఆరు మొక్కలు నాటాలని ఎంపీపీ […]

Read More
అట్టహాసంగా డాక్టర్స్ డే

అట్టహాసంగా డాక్టర్స్ డే

సారథి, రామడుగు: కరీంనగర్ ​జిల్లా రామడుగు మండలం గోపాల్​రావుపేటలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం డాక్టర్స్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అందులో భాగంగానే గుండి పీహెచ్​సీలోని ఇద్దరు డాక్టర్లను సన్మానించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దురుశెట్టి మల్లేశం, సెక్రటరీ కోడీమ్యాల వేణుగోపాల్, కోశాధికారి రాంపల్లి శ్రీనివాస్, కోడీమ్యాల వెంకట్ రమణ, కర్ర శ్యాంసుందర్, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Read More
చాలెంజ్​గా హరితహారం

చాలెంజ్​గా హరితహారం

సారథి, రామడుగు: నాలుగో విడత హరితహారంపై మంగళవారం కరీంనగర్ ​జిల్లా రామడుగు ఎంపీడీవో ఆఫీసులో ఎంపీపీ కలిగేటి కవిత అధ్యక్షతన నిర్వహించారు. ప్రతి గ్రామంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆమె కోరారు. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని యజ్ఞంలా చేపట్టారని అన్నారు. హరితహారాన్ని చాలెంజ్​గా తీసుకోవాలని సూచించారు. జడ్పీటీసీ సభ్యురాలు మారుకొండ లక్ష్మీ, ఏఎంసీ చైర్మన్ గంటల వెంకటరెడ్డి, ఎంపీడీవో ఎన్నర్ మల్హోత్ర, ఎంపీవో సతీష్ కుమార్, గుండి గోపాల్రావుపేట ప్రాథమిక ఆరోగ్య […]

Read More