సారథిన్యూస్, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ కలెక్టర్ శర్మన్‌కు జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి రాఖీ కట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెకు రాఖీపౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. కరోనా సమయంలో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని కలెక్టర్ సూచించారు.
ఢిల్లీ: రాఖీ పౌర్ణమి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఓ ఉద్వేగభరిత ట్వీట్ చేశారు. ప్రేమ, సహనం వంటి ఉత్తమ గుణాలను సోదరుడు రాహుల్‌గాంధీ నుంచే తాను నేర్చుకున్నారని పేర్కొన్నారు. రాహుల్ లాంటి సోదరుడు దొరకడం తన అదృష్టమని వ్యాఖ్యానించారు. రాఖీ పండుగ సందర్భంగా దేశప్రజలందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రాహుల్‌గాంధీతో కలిసి ఉన్న ఓ ఫోటోను ఆమె షేర్ చేశారు.
సారథిన్యూస్, పెద్దపల్లి: ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా రాఖీ కడుదామనుకున్న ఓ సోదరి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు ఆ మహిళను బలితీసుకున్నది. సోదరుడి చేతుల్లోనే ఆ యువతి ప్రాణాలు విడిచింది. ఈ విషాధ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని రాజీవ్ రహదారిపై శనివారం చోటుచేసుకున్నది. పెద్దపల్లి జిల్లాకు చెందని ఓ మహిళ రాఖీ పౌర్ణమి పండుగకోసం తన సోదరుడితో కలిసి గోదావరిఖనికి బైక్‌పై వస్తుండగా.. రాజీవ్ […]