మృతురాలు రాజస్థాన్ వాసి సారథి: పెద్దశంకరంపేట: మండల కేంద్రమైన పెద్దశంకరంపేట ప్రియాంకకాలనీలో విద్యుదాఘాతంతో ప్రజాపతి కేసరి (22)అనే మహిళ చనిపోయింది. ఇంట్లో ఐస్ క్రీమ్ లు తయారుచేస్తూ ఉండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురైంది. భర్త వినోద్ కుమార్ తో పాటు ఆమె రాజస్థాన్ నుంచి జీవనోపాధికి పెద్దశంకరంపేట వచ్చిన ఈ కుటుంబం ఐస్ క్రీమ్ లు తయారుచేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఐస్ క్రీమ్ తయారుచేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగలడంతో ప్రజాపతి కేసరి […]
జైపూర్, న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ సెషన్ నిర్వహించేందుకు గవర్నర్ పర్మిషన్ ఇచ్చిన నేపథ్యంలో తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జైపూర్ రిసార్ట్ నుంచి జైసల్మీర్‌లోని హోటల్‌కు తరలిస్తున్నారని సమాచారం. ఆగస్టు 14న బలపరీక్ష నిర్వహించేందుకు సీఎం అశోక్ గెహ్లాట్ వర్గం సిద్ధం అవుతోంది. తనకు సపోర్ట్‌గా ఉన్న 100 మంది ఎమ్మెల్యేలను జైపూర్‌లోని రిసార్ట్ నుంచి జైసల్మీర్‌లోని రిసార్ట్‌కు తరలిస్తున్నారు. బీజేపీ తమ పార్టీలోని […]
న్యూఢిల్లీ: సొంత పార్టీపై తిరుగుబాటు చేసిన సచిన్ పైలెట్‌పై కాంగ్రెస్ సీనియర్ నేత, సీనియర్ లాయర్ కపిల్ సిబల్ ఫైర్ అయ్యారు. 20 – 25 మంది ఎమ్మెల్యేలతోనే సీఎం అయిపోతావా? అంటూ ప్రశ్నించారు. పార్టీని పబ్లిక్ ముందు తమాషా చేయొద్దన్నారు. ‘సచిన్ నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. నువ్వు సీఎం అవ్వాలని అనుకుంటున్నవా? మాకు చెప్పు. ఈ తిరుగుబాటు ఎందుకు? బీజేపీతో కలవను అని చెబుతున్న నీవు హర్యానాలో ఎందుకు ఉన్నావు. పార్టీ సమావేశాలకు ఎందుకు రాననుంటున్నావు. […]
న్యూఢిల్లీ: పదిరోజులుగా రోజుకో మలుపు తిరుగుతున్న రాజస్థాన్ రాజకీయం తాజాగా సుప్రీం కోర్టుకు చేరింది. 18 మంది రెబల్ ఎమ్మెల్యేల విషయంలో శుక్రవారం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి సుప్రీం కోర్టులో పిటిషన్ వేయనున్నారు. ‘నేను న్యాయమూర్తులను గౌరవిస్తాను. షో కాజ్ నోటీసు పంపే పూర్తి అధికారం స్పీకర్‌కు ఉంది. సుప్రీం కోర్టులో ఎస్‌ఎల్‌పీ పిటిషన్ వేయాలని మా లాయర్‌ను కోరాను. హైకోర్టు […]
జైపూర్: అశోక్ గెహ్లాట్ గవర్నమెంట్‌ను కూల్చేందుకు సచిన్‌పైలెట్ తమతో బేరాలు ఆడారని, డబ్బుల ఆశ చూపించారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేలపై సచిన్‌పైలెట్ సీరియస్ అయ్యారు. అనవసరంగా తనపై ఆరోపణ చేయొద్దని, ప్రతి ఒక్కరూ రూ.ఫైన్ కట్టి తనకు క్షమాపణలు పంపాలని నోటీసులు ఇచ్చారు. తన రాజకీయ మైలేజ్‌ను దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పైలెట్ ఆరోపించారు. గెహ్లాట్ గవర్నమెంట్‌ను కూల్చేందుకు పైలెట్ కుట్ర పన్నుతున్నారని, అందుకే సాక్ష్యమని ఎమ్మెల్యే మలింగ […]
జైపూర్: కాంగ్రెస్ ఎమ్మెల్యేల సపోర్ట్‌తోనే తాను ధైర్యంగా ఉన్నానని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. మంగళవారం ఉదయం జరిగిన మూడో సీఎల్పీ సమావేశంలో ఆయన ఈ విషయ చెప్పారు. సచిన్ పైలెట్ ఎన్ని ఇబ్బందులు పెట్టాలని చూసినా ఎమ్మెల్యేలంతా తనతో ఉండి నమ్మకంతో సపోర్ట్ చేశారని అన్నారు. తమకు 115 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందన్నారు. ఆ తర్వాత రాజస్థాన్ కేబినెట్ మీటింగ్ కూడా నిర్వహించారు. రాజస్థాన్ అనిశ్చితి తర్వాత గెహ్లాట్ రెండుసార్లు సీఎల్పీ సమావేశం […]
జైపూర్: రాజస్థాన్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్‌తో పాటు 18 మందికాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం పడిపోయిన విషయం తెలిసిందే. వచ్చేవారం బలపరీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం ఉదయం అశోక్ గెహ్లాట్ గవర్నర్‌ను కలిశారని తెలుస్తోంది. బీటీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అశోక్ గెహ్లాట్‌కు మద్దతు ఇవ్వడంతో గెహ్లాట్ గవర్నర్‌ను కలిశారని చెప్పారు. సీఎం గెహ్లాట్ నివాసంలో జరిగిన సీఎల్పీ భేటీ సందర్భంగా కాంగ్రెస్‌కు తమ మద్దతు ఇస్తున్నట్లు […]
న్యూఢిల్లీ: పార్టీలో తనకు సముచిత స్థానం కల్పించలేదంటూ సొంతపార్టీ కాంగ్రెస్ పైనే తిరుగుబాటు చేసిన రాజస్థాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో భేటీ అయ్యేందుకు నిరాకరించారంట. తనను ఏడాదిలోపు సీఎం చేయాలని ఆయన డిమాండ్ చేశారని, హామీ ఇచ్చే వరకు తాను భేటీ అయ్యేది లేదని తేల్చి చెప్పారని ప్రియాంకగాంధీకి సన్నిహితుల్లో ఒకరు చెప్పారు. తనను సీఎంను చేస్తానని పబ్లిక్‌గా అనౌన్స్ చేయాలని పైలెట్ కోరారని అన్నారు. డిప్యూటీ సీఎం పదవి నుంచి […]