సారథి న్యూస్, ఖమ్మం, రామడుగు,చొప్పదండి: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గొప్ప రాజనీతిజ్ఞుడని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో పీవీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఖమ్మం కలెక్టరేట్లో మంత్రి పువ్వాడ అజయ్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ పీవీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఖమ్మంలో పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుచేస్తామని పేర్కొన్నారు. దేశానికి మార్గనిర్దేశనం చేసిన మహనీయుడు మాజీ ప్రధాని పీవీ అని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. మహబూబాబాద్‌లో […]
సారథిన్యూస్, ఖమ్మం: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయమని అఖిలభారత బ్రాహ్మణ సర్వీస్ నెట్వట్ వర్క్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అభిప్రాయ పడింది. ప్రభుత్వ నిర్ణయం బ్రాహ్మణులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. బ్రాహ్మణులకు సంబంధించిన భూ సంబంధ సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరువ తీసుకోవాలని కోరారు.