సామాజిక సారథి డిండి: ప్రజా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని తిరుమలాపురంలో సీపీఐ నూతన జెండా ఆవిష్కరణతో పాటు జోగు బజార్ 12 వ వర్ధంతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు బజార్ స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఎండి మైన్ఉద్దీన్, సీపీఐ మండల కార్యదర్శి పోలే వెంకటయ్య, […]
అదనపు కలెక్టర్ వీరారెడ్డి సామాజిక సారథి, సంగారెడ్డి: ప్రజావాణిలో వివిధ సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆయా శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలతో వచ్చిన సుమారు 50 దరఖాస్తులను కలెక్టర్ స్వీకరించారు. కార్యక్రమంలో రెవెన్యూ జిల్లా అధికారి రాధికరమణి, వివిధ శాఖల ఉన్నతాధికారులు, అర్జిదారులు పాల్గొన్నారు.
సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో జరిగే వారంతపు సంతలో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. కరోనా వేళ సంతకు ప్రజల రాకపోకలు కొంత మేర తగ్గించినప్పటికీ కూరగాయలు, తృణధాన్యాలు, దుస్తులు, మసాలాలు, చిన్నచిన్న వస్తువుల కోసం ఈ సంతకే వస్తుంటారు. కానీ ఇక్కడ కనీసవసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంత సమీపంలో పైకప్పులేని డ్రైనేజీ ఉండటంతో దుర్వాసన వెదజల్లుతున్నది. పంచాయతీ సిబ్బంది మార్కెట్ ఫీజు వసూలు చేస్తున్నప్పటి.. పట్టించుకోవడం లేదు. […]