Breaking News

PRIVATE TEACHERS

ప్రైవేట్​టీచర్లను ఆదుకోవాలి

ప్రైవేట్​ టీచర్లను ఆదుకోవాలి

సారథి, చొప్పదండి: ప్రైవేట్​ టీచర్లను ఆదుకోవాలని అసోసియేషన్​అధ్యక్షుడు మాచర్ల మహేశ్​ప్రభుత్వాన్ని డిమాండ్​చేశారు. సోమవారం కరీంనగర్​జిల్లా చొప్పదండి ఆకాశ్ పబ్లిక్ స్కూలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా కారణంగా స్కూళ్లు మూతపడి 18 నెలలు అవుతోందని, ప్రైవేట్​ఉపాధ్యాయులు మానసికంగా కృంగిపోయారని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రూ.2వేల ఆర్థిక సాయం, 25 కేజీల బియ్యం కొంత స్వాంతన కలిగించిందన్నారు. కానీ ప్రభుత్వం మూడునెలలకే ఆ సహాయాన్ని నిలిపివేసిందన్నారు. ప్రీ ప్రైమరీ టీచర్లు, ప్రైమరీ టీచర్లకు జీవనోపాధి లేక వారి బతుకుదెరువు […]

Read More
ప్రైవేట్​టీచర్లకు బియ్యం పంపిణీ

ప్రైవేట్​ టీచర్లకు బియ్యం పంపిణీ

సారథి, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండల కేంద్రంలో ప్రైవేట్​ టీచర్లుగా పనిచేస్తున్న 8 మందికి రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న 25 కిలోల బియ్యాన్ని గ్రామ సర్పంచ్ పంజాల ప్రమీల, కోఆప్షన్ సభ్యుడు మాదం ఎల్లయ్యతో కలిసి ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రైవేట్​ ఉపాధ్యాయులు సీఎం కేసీఆర్​కు కృతజ్క్షతలు తెలిపారు.

Read More
ప్రైవేట్ టీచర్లకు వరాలు

ప్రైవేట్ టీచర్లకు వరాలు

రూ.2వేలు, 25 కేజీల బియ్యం ప్రకటించిన సీఎం కేసీఆర్సారథి, హైదరాబాద్​: కరోనా మహమ్మారి విజృంభిస్తున్నకారణంగా స్కూళ్లు మూతపడిన నేపథ్యంలో ప్రైవేట్ టీచర్లను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. టీచర్లు, సిబ్బందికి నెలకు 25 కేజీల బియ్యంతో పాటు రూ.రెండువేల ఆపత్కాల ఆర్థికసాయం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. సహాయం పొందాలనుకునే టీచర్లు ప్రైవేట్ విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బంది తమ బ్యాంకు ఖాతా, వివరాలతో ఆయా జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యాశాఖ అధికారులను సమన్వయం […]

Read More
ప్రైవేట్ టీచర్లను ఆదుకుందాం.. రండి

ప్రైవేట్ టీచర్లను ఆదుకుందాం.. రండి

సారథి న్యూస్, ములుగు: సమాజ విజ్ఞానాభివృద్ధికి మూలం, దైవం కన్నా మిన్న అయిన ఉపాధ్యాయులకు ప్రతిఒక్కరూ చేయూతనివ్వాలని సర్వర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ అన్నారు. ఆదివారం స్థానిక ఎస్టీయూ భవన్ లో ములుగు జిల్లా ప్రైవేట్ టీచర్లకు సర్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ టీచర్లను ఆదుకునేందుకు ప్రతిఒక్కరూ ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలా […]

Read More
నిరుద్యోగ భృతి ఇవ్వాలి

నిరుద్యోగ భృతి ఇవ్వాలి

సారథి న్యూస్, హుస్నాబాద్: గత ఎన్నికల్లో నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తక్షణమే నిరుద్యోగ భృతి అమలు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య(ఏఐవైఎఫ్) రాష్ట్ర కార్యదర్శి మారుపక అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశం గురువారం జిల్లా కేంద్రంలోని ఎడ్ల గురువారెడ్డి భవన్ లో జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో నిరుద్యోగుల ఓట్లను ఆకర్షించేందుకు నిరుద్యోగ భృతి నెలకు రూ.3116 ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. అధికారంలోకి రాగానే […]

Read More
తమ సమస్యలు పరిష్కరించాలంటూ ములుగు ఎమ్మెల్యే సీతక్కకు వినతిపత్రమిస్తున్న ప్రైవట్​ టీచర్లు

కష్టాల్లో ప్రైవేట్​ టీచర్లు

సారథి న్యూస్, ములుగు: లాక్​డౌన్​తో ప్రైవేట్​ స్కూల్​ టీచర్లు ఎంతో ఇబ్బంది పడుతున్నారని.. వారి సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ ఉపాధ్యాయుల సంఘం నాయకులు సోమవారం ములుగులో ఎమ్మెల్యే సీతక్కకు వినతిపత్రమిచ్చారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రైవేట్​ టీచర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నల్లెల కుమారస్వామి, ఆక రాధాకృష్ణ, మైల జయరాం రెడ్డి, నమాకరం చంద్ బానోతు రవి చందర్, మామిడి శెట్టి కోటి తదితరులు పాల్గొన్నారు.

Read More