ఏపీ, తెలంగాణలో ధరలు పెంచిన డీలర్లు సామాజిక సారథి, హైదరాబాద్ : ఇప్పటికే నిత్యావసరల ధరలు, కూరగాయల ధరలు, పెట్రోల్ ధరలు, గ్యాస్ ధరల పెంపుతో అల్లాడిపోతున్న సామాన్యులకు మరో షాక్ తగిలింది. ఏపీ, తెలంగాణలో సిమెంట్ బస్తాల ధరలు పెరిగాయి. 50 కిలోల బస్తాపై ధరను రూ.20 –30 మేర పెంచుతున్నట్లు డీలర్లు పేర్కొన్నారు. డిమాండ్ పెరిగే అవకాశం ఉండటంతో వీటి ధర పెంచినట్లు చెప్పారు. ధరల పెంపుతో సిమెంట్ బస్తా ధర రూ.300–350 మధ్యలో […]
సామాజిక సారథి, వరంగల్: వరంగల్ ఎనుమాముల మార్కెట్ లో మిర్చి ధర మంగళవారం పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రూ.18వేలు పలికిన వండర్ హాట్ మంగళవారం రూ.18500, 341 రకం 17500, తేజ రకం రూ.15400 ఉన్నట్టు అధికారులు తెలిపారు. మార్కెట్లో పత్తికూడా రికార్డు ధర పలికింది. రూ.8715 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. సీజన్ లో పత్తి ధర ఈ విధంగా పలకడం ఇదే మొదటిసారి కావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు
సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: కేంద్ర ప్రభుత్వం రెండోసారి అధికారంలోకచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు, వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్య ప్రజల జీవన, ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఏఐడిడబ్ల్యూఏ) రాష్ట్ర సహాయ కార్యదర్శి కందికొండ గీత అన్నారు. ఆదివారం కేంద్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా దిగివచ్చి రైతు […]