Breaking News

PEOPLE

హైదరాబాద్‌ లాక్‌డౌన్‌..?

సారథిన్యూస్​, హైదరాబాద్​: హైదరాబాద్‌ పరిధిలో రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఎప్పుడు.. ఎక్కడ.. ఎవరికి సోకుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు హైదరాబాద్‌ నగరంలోనే 8వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. చాలామంది మృత్యువాత పడ్డారు. మార్చి నెలలో హైదరాబాద్‌ నగరంలో 74 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అప్పటి నుంచి వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. ఏప్రిల్‌ నెలలో 527, మేలో 1,015 నమోదు కాగా, జూన్‌లో మరింతగా విజృంభించాయి. జూన్‌ నెలలో ఇప్పటి […]

Read More

వణికిన మెక్సికో

మెక్సికో సిటీ : భారీ భూకంపంతో మెక్సికో నగరం వణికిపోయింది. రిక్టర్​ స్కేలుపై భూకంప తీవ్రత 7.7 గా నమోదైందని యూఎస్​ జియోలాజికల్​ సర్వే వెల్లడించింది. దక్షిణ మెక్సికోలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టుగా తెలిపింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.29 గంటలకు ఈ భూకంపం సంభవించింది. ఆక్సాకా స్టేట్‌ పసిఫిక్‌ తీరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతం అయినట్టుగా సమాచారం. భూకంప ప్రభావంతో మెక్సికోలో పలు భవనాలు కంపించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు […]

Read More

అడకత్తెరలో పోక చెక్కలా..!

ఇండియాలో ప్రజల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది. కరోనా తల్లడిల్లుతున్న జనాలను కాపాడాల్సిన సర్కారు వారి నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేసే కార్యక్రమానికి పదును పెట్టింది. ఇప్పటికే పనులు లేక ఆదాయం రాక అవస్థలు పడుతున్న జనంపై పెట్రోలియంపై పన్నులు పెంచి మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా చేసింది. దేశంలో కరోనా కలకలం రేపుతోంది. ప్రజల ప్రాణాలనే కాదు.. జీవితాలను కూడా దుర్భరం చేసింది. రెండు నెలలకు పైగా ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించాయి. దీంతో చిరు […]

Read More