Breaking News

PALWANCHA

నీళ్లు ఇప్పించండి.. మహాప్రభో!

నీళ్లు ఇప్పించండి.. మహాప్రభో!

సారథి న్యూస్, పాల్వంచ: మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని ఆదివారం దసరా పండగ పూట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం ఉల్వనూరు గ్రామ మహిళలు రోడ్డెక్కారు. మంచి నీళ్లు ఇప్పించండి మహాప్రభో.. అని ఖాళీబిందెలతో నిరసన తెలిపారు. ‘చుట్టుపక్కల గ్రామాల అన్నింటికీ భగీరథ నీళ్లు వస్తున్నాయి. కానీ తమ ఊరుకు మాత్రం రావడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం పట్టించుకోవడం లేదు. కలెక్టర్ గారు! ఎమ్మెల్యే గారు! మీరైనా మా బాధలను అర్థం […]

Read More
రూ.కోటి పరిహారం.. ఉద్యోగం ఇవ్వాలి

రూ.కోటి పరిహారం.. ఉద్యోగం ఇవ్వాలి

సారథి న్యూస్, పాల్వంచ: శ్రీశైలం ఎడమ గట్టు పవర్​హౌస్​ ప్రమాదంలో మృతిచెందిన విద్యుత్​శాఖ ఉద్యోగుల బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.కోటి పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని బీజేపీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ (చిన్ని) డిమాండ్ ​చేశారు. ఇటీవల పవర్ హౌస్​లో జరిగిన ప్రమాదంలో మృతిచెందిన పాల్వంచ ఇందిరా నగర్ కాలనీకి చెందిన జూనియర్ ప్లాంట్ అటెండెంట్​ కిరణ్​ కుమార్​ ఇంటికి వెళ్లి బాధిత కుటుంబసభ్యులను ఆదివారం పరామర్శించారు. కేంద్ర […]

Read More

పాల్వంచలో కరోనా విజృంభణ

సారథి న్యూస్​, పాల్వంచ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కరోనా విజృంభిస్తున్నది, గత మూడురోజుల్లో 36 మంది కరోనా పరీక్షలు నిర్వహించగా 25 మందికి పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కాగా బుధవారం ఒక్కరోజు 12 మందికి కరోనా పరీక్షలు చేస్తే 12 మందికి పాజిటివ్​ వచ్చింది. దీంతో టెస్టులను మరింత పెంచితే కేసులు పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వచ్చిన రోగులను కాంటాక్ట్​లను గుర్తించే పనిలో […]

Read More

కిన్నెరసానికి భారీ వరద

సారథిన్యూస్​, పాల్వంచ: కిన్నెరసాని రిజర్వాయర్​లోకి భారీగా వరదనీరు వస్తున్నదని కేటీపీఎస్​ 5,6 దశల సీఈ రవీంద్రకుమార్​ తెలిపారు. మంగళవారం రాత్రి గేట్లు ఎత్తి ఐదువేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తామని చెప్పారు. కిన్నెరసాని పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, గేట్లు తెరిచిన సమయంలో కిన్నెరసాని వాగులో ఎలాంటి రాకపోకలు చేయవద్దని హెచ్చరించారు. కిన్నెరసాని రిజర్వాయర్​ పూర్తిస్థాయి నీటిమట్టం 8.4 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.495 టీఎంసీల నీరు ఉన్నది. 10 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో […]

Read More

అంబేద్కర్​ బాటలో నడుద్దాం

సారథిన్యూస్​, కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కిన్నెరసాని గ్రామంలోని ట్రైబల్ వెల్ఫేర్​ కళాశాలలో మంగళవారం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అంబేద్కర్​ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మనమంతా అంబేద్కర్​ చూపిన దారిలో పయనించాలని పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి కిన్నెరసాని ప్రాజెక్టును సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా టీఆర్​ఎస్​ నేత వనమా రాఘవేంద్రరావు, డీసీఎంఎస్​ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, జెడ్పీటీసీ వాసుదేవరావు, టీఆర్​ఎస్​ నేతలు కనకేశ్, రాజుగౌడ్, ప్రకాశ్, నాగేశ్వరరావు, భాస్కర్, […]

Read More