శ్రీనగర్: పాక్ ఆక్రమిత్ కశ్మీర్ (పీవోకే)లో చైనాకు వ్యతిరేకంగా సోమవారం ఆందోళనలు జరిగాయి. నీలం, జీలం నదులపై అక్రమంగా చేపడుతున్న జల విద్యుత్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ముజఫరాబాద్‌లో అక్కడి ప్రజలు నిరసన చేపట్టారు. ‘సేవ్ రివర్స్, సేవ్ జమ్మూ’ పేరుతో సోషల్ మీడియాలో క్యాంపైన్ స్టార్ట్ చేశారు. ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన ఒప్పందాలు ఏ ప్రాతిపదికన చేసుకున్నారని నిరసనకారులు ప్రశ్నించారు. ఈ విషయంలో రెండు దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. […]
సినిమా తారలు, క్రీడాకారుల వ్యక్తిగత సంబంధాలపై పుకార్లు రావడం కొత్త కాదు. కొందరు ఆకతాయిలు సోషల్‌మీడియా వేదికగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ఇష్టమొచ్చినట్టు పుకార్లు పుట్టిస్తున్నారు. తాజాగా నటి తమన్నా పాక్ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌తో ప్రేమలో పడిందంటూ సోషల్ మీడియా కోడై కూసింది. ఓ నగల షాప్‌లో రజాక్‌తో కలిసి తమన్నా నగలు కొనుగోలు చేస్తున్నదంటూ ఓ ఫొటోను కూడా సోషల్‌మీడియాలో వైరల్ చేశారు. దీంతో విసుగు చెందిన మిల్కీబ్యూటీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది. […]
న్యూఢిల్లీ: గత వన్డే ప్రపంచకప్ లో పాకిస్థాన్ అవకాశాలు దెబ్బకొట్టే విధంగా భారత జట్టు ప్రవర్తించిందని ఆ దేశ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ అన్నాడు. పాక్ సెమీస్ కు అర్హత సాధిస్తే.. కోహ్లీసేనకు ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో ప్రదర్శనలో తేడా చూపెట్టిందన్నాడు. అందుకే కచ్చితంగా గెలుస్తుందనుకున్న ఇంగ్లండ్ తో మ్యాచ్ లో కావాలని ఓడిపోయిందని విమర్శించాడు. ‘ఇంగ్లండ్ తో లీగ్ మ్యాచ్ లో భారత్ చెత్తగా ఆడింది. వాళ్లు సత్తా మేరకు ఆడితే కచ్చితంగా గెలివాళ్లు. […]