సారథి న్యూస్, రామాయంపేట: తెలంగాణ రాష్ట్రంలో పేదల ప్రభుత్వం కొనసాగుతున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. మంగళవారం మెదక్ జిల్లా నిజాంపేట, రామాయంపేట మండలాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే కల్యణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
సారథి న్యూస్, చిన్నశంకరంపేట: ప్రజలంతా జాగ్రత్తలు పాటించి కరోనా మహమ్మారిని జయించాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి సూచించారు. కరోనా వచ్చినవారు భయపడాల్సిన అవసరం లేదని.. దేశంలో 70 శాతం మంది వ్యాధి నుంచి కోలుకుంటున్నారని ఆమె భరోసా కల్పించారు. బుధవారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలకేంద్రంలో ఆమె పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలు కూడా కరోనా రోగులపై వివక్ష చూపించవద్దని కోరారు. కరోనా వచ్చినంతమాత్రాన వారి కుటుంబాలను […]