సారథిన్యూస్, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో కరోనా విజృంభిస్తున్నది. కొత్తగా జిల్లాలో మరో ఏడు కరోనా కేసులు నమోదైనట్టు సమాచారం. సూర్యాపేట జిల్లాకేంద్రంలో జమ్మిగడ్డ, అలంకార్ రోడ్, గడ్డిపల్లి, దోసపహాడ్, తిరుమలగిరి, (మాలిపురం) ప్రాంతాలతోపాటు కోదాడ, హుజూర్ నగర్ లలోనూ కేసులు నమోదయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని అధికారులు కోరుతున్నారు.
సారథిన్యూస్, నల్లగొండ: కరోనా మహమ్మారి జీహెచ్ఎంసీతోపాటు జిల్లాలను వణికిస్తున్నది.తాజాగా నల్లగొండ జిల్లాలో 25 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటీవల కరోనా సోకిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌ల శాంపిల్లు సేకరించగా 25 కొత్తకేసులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. మిర్యాలగూడ, నల్లగొండ, నకిరేకల్ మండలాల్లో అత్యధిక కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. పాజిటివ్ వచ్చనవారిలో పోలీస్, వైద్యసిబ్బంది ఉన్నట్టు సమాచారం.
సారథిన్యూస్, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలో మరో 12 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ వచ్చింది. వారికి ఒక్కొక్కరికి 20 వేల రూపాయలు, హోంక్వారైంటైన్లో మరో ఐదుగురికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నట్టు మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. ఇప్పటి వరకు 99 మంది జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ రాగా ఒక్కొక్కరికి రూ. 20 వేల చొప్పున 19 లక్షల 80 వేలు రూపాయలు ఆర్థికసాయం అందించామని చెప్పారు. హోంక్వారంటైన్లో ఉన్న 52 మందికి […]