సారథిన్యూస్, రామగుండం: రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని.. కేసీఆర్ నాయకత్వానికి ప్రజలు మద్దతిస్తున్నారని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. ఎన్నికలేవైనా టీఆర్ఎస్ విజయం సాధించి తీరుతుందని చెప్పారు. మంగళవారం ఆయన రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లకు ఇంచార్జిలను నియమించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతన ఇంచార్జ్లు పార్టీని మరింత బలోపేతం చేయాలని.. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు.