Breaking News

NARSAPUR

పంటమార్పిడి తప్పనిసరి

సారథి న్యూస్, నర్సాపూర్: రైతులు పంట మార్పిడి తప్పనిసరిగా చేసుకోవాలని కలెక్టర్ ధర్మారెడ్డి సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నియంత్రణ వ్యవసాయ సాగుపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. బుధవారం మండలంలోని మహమ్మద్ నగర్, సలాబత్ పూర్ గ్రామాల్లో సదస్సులను నిర్వహించగా జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ..దేశంలో పప్పుదినుసుల పంటల సాగు తక్కువగా ఉన్నందున దిగుమతి చేసుకోవడంతో విదేశీ మారకం భారం పడుతుందని, కనుక […]

Read More

సడక్ సక్కగైంది.. జాగ్రత్త

ఎమ్మెల్యే మదన్ రెడ్డి సారథి న్యూస్, నర్సాపూర్: ‘నర్సాపూర్ మెదక్ హైవే పనులు పూర్తయినయ్​.. ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని’ ఎమ్మెల్యే మదన్ రెడ్డి సూచించారు. బుధవారం కొల్చారం మండల కేంద్రంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం పోతంశెట్టిపల్లి వద్ద ఫోర్ లేన్ రోడ్డు పనులను ప్రారంభించారు. సరుకుల పంపిణీకి సహకరించిన సర్పంచ్​ల ఫోరం అధ్యక్షుడు విష్ణువర్ధన్​ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రోడ్డు పనులు పూర్తయిన నాటినుంచి ప్రమాదాలు తరచూ చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. […]

Read More
ఉపాధి కూలీలకు పండ్లు పంపిణీ

ఉపాధి కూలీలకు పండ్లు పంపిణీ

సారథి న్యూస్, నర్సాపూర్: ఎల్లంకి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్, లయన్స్​ క్లబ్ నర్సాపూర్ స్నేహబంధ్ సెక్రటరీ అశోక్ కుమార్ వివాహ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం నర్సాపూర్ లో ఉపాధి హామీ కూలీలకు అరటిపండ్లు పంపిణీ చేశారు. వేసవిలో పనులు చేసుకుంటున్న వారికి తమవంతు సాయంగా వాటిని పంపిణీ చేశానని చెప్పారు.

Read More
నిరుపేద కుటుంబానికి సరుకులు

నిరుపేద కుటుంబానికి సరుకులు

సారథి న్యూస్, నర్సాపూర్: కొల్చారం మండలంలోని కిష్టాపూర్​​ గ్రామంలో సర్పంచ్​ గోదావరి తన భర్త వెంకట్రాములు సహకారంతో  నిరుపేద కుటుంబానికి చెందిన 50మందికి నిత్యావసర సరుకులు పంపిణీచేశారు. కార్యక్రమంలో వార్డుసభ్యులు, విలేజ్​ సెక్రటరీ పాల్గొన్నారు.

Read More
వసతులు కల్పించండి

వసతులు కల్పించండి

బీజేపీ నేతల వినతి సారథి న్యూస్, నర్సాపూర్: సొసైటీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు తీర్చాలని మెదక్​ జిల్లా కౌడిపల్లి తహసీల్దార్ ఆఫీసులో శనివారం బీజేపీ జిల్లా నాయకుడు రాజేందర్, రాకేశ్ వినతిపత్రం అందజేశారు. టెంట్లు వేయాలని, తాగునీటి వసతి కల్పించాలని కోరారు. రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. రాజేందర్, రాకేష్ ,రాజు పాల్గొన్నారు

Read More
జర్నలిస్టులకు సరుకులు పంపిణీ

జర్నలిస్టులకు సరుకులు పంపిణీ

సారథి న్యూస్, నర్సాపూర్: కరోనా నేపథ్యంలో జర్నలిస్టులు, పోలీసులు చేస్తున్న కృషి అమోఘమని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమన్నగారి లక్ష్మీ రవీందర్ రెడ్డి కొనియాడారు. టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్​ కుమార్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి ఆదేశానుసారం శనివారం మెదక్​ జిల్లా కొల్చారంలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం పోలీస్​ స్టేషన్ లో ఎస్సై సార శ్రీనివాస్ గౌడ్ ను శాలువాతో సన్మానించి సిబ్బందికి శానిటైజర్లు, మాస్క్​లు అందజేశారు.

Read More

పేదలకు చేయూత భేష్​

నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్​ రెడ్డి సారథి న్యూస్, నర్సాపూర్: కరోనా సమయంలో పేదలను ఆదుకోవడం అభినందనీయమని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాజీమంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం నర్సాపూర్ సీఎస్ఐ చర్చి కమిటీ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి హాజరయ్యారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ కరోనాను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Read More
వలస కార్మికులకు చేయూత

వలస కార్మికులకు చేయూత

వలస కార్మికులకు చేయూత.. జహీరాబాద్ నుంచి శివ్వంపేట మీదుగా ఉత్తరప్రదేశ్ లో.. సారథి న్యూస్, నర్సాపూర్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నుంచి శివ్వంపేట మీదుగా ఉత్తరప్రదేశ్ లోని వారి సొంత గ్రామాలకు కాలినడకన వెళ్తున్న కూలీలకు బుధవారం శివ్వంపేట మండల కేంద్రంలో జడ్పీటీసీ సభ్యుడు మహేష్ గుప్తా తనవంతు సాయంగా ఒక్కొక్కరికి రూ.రెండువేల నగదుతో పాటు పిల్లలకు బిస్కెట్ ​ ప్యాకెట్లు, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.

Read More