Breaking News

NARKATAPALLY

చంద్రబాబు కాన్వాయ్​లో సాంకేతికలోపం

చంద్రబాబు కాన్వాయ్​లో సాంకేతికలోపం

సారథి న్యూస్, నల్లగొండ: టీడీపీ అధినేత, మాజీ సీఎం ఎన్​.చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న కాన్వాయ్ సాంకేతిక లోపం కారణంగా శుక్రవారం సాయంత్రం నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రి వద్ద నిలిచిపోయింది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపునకు చంద్రబాబు వెళ్తున్నారు. ఇంతలో వాహనం నిలిచిపోయింది. అప్రమత్తమైన సిబ్బంది మరో వాహనశ్రేణిలో ఆయనను హైదరాబాద్​కు తీసుకెళ్లారు.

Read More